వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం భారత్ జట్టు ఓ టీ20
సిరీస్‌ను కూడా కరీబియన్లతో ఆడనున్నట్లు సమాచారం. టెస్టు సిరీస్ ఆగస్టు
22న ముగియనుండగా.. అనంతరం ఇదే నెల చివరి వారంలో ఈ టీ20 సిరీస్‌ను అమెరికాలోని
ఫ్లోరిడాలో నిర్వహించేందుకు చర్చలు జరుపుతున్నట్లు బీసీసీఐ అధికారి
ఒకరు తెలిపారు. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా మ్యాచ్‌ల నిర్వహణపై
అక్కడి స్టేడియం మేనేజర్‌తో అధికారకంగా సంప్రదింపులు జరిపినట్లు
తెలిసింది. ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న టెస్టు జట్టులోని 15
మంది సభ్యుల్లో 8 మంది టీ20 ఆటగాళ్లు కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే
అంశం. అమెరికాలో టీ20 సిరీస్ నిర్వహణపై ఐసీసీ అనుమతి కోసం సంప్రదింపులు
జరుపుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అనుమతిరాగానే అధికారిక నిర్ణయం
ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment