చిరంజీవి 150వ చిత్రం
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ హీరోయిన్‌పై మాత్రం చిత్రబృందం నోరు
విప్పట్లేదు. ఈ విషయంపై రోజుకో వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
మొదట్లో దీపికా అన్నారు, తరువాత అనుష్క అన్నారు, ఆ తరువాత విజయశాంతి
అన్నారు.. కానీ ఏ ఒక్కరూ నిజం కాలేదు. తాజాగా టాలీవుడ్‌లో కొద్ది కాలం
క్రితం వరకూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న కాజల్ చేరిపోయారు. ఈ సినిమాలో
నటించమని చిత్రబృందం కాజల్‌ను అడిగినట్లు.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్
చేయడంతో.. ఎక్కడా అవకాశాల్లేని కాజల్‌కు అంత రెమ్యునరేషన్ ఇవ్వడం అవసరమా
అని చిత్రబృందం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, మెగాస్టార్
ప్రతిష్టాత్మక చిత్రంలో ఆపర్ ఇస్తే.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే
కాక, నటించనన్న కాజల్‌పై మెగా అభిమానులు గుర్రుమంటున్నారు.

No comments:
Post a Comment