Wednesday, 20 July 2016

తెలంగాణ రాష్ట్ర చేప ‘కొర్రమీను’

కొర్రమీనుకు తెలంగాణ రాష్ట్ర చేప హోదా దక్కింది. ఈ మేరకు రాష్ట్ర చేపగా ప్రకటిస్తూ పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేశాయి. గత ఏడాది కాలంగా ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే కొర్రమీనులో ఔషద విలువలు కూడా ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో కొర్రమీనును రాష్ట్ర చేపగా ప్రభుత్వం ప్రకటించింది. బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదంలోనూ కొర్రమీనునే ఉపయోగిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రపక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర పండు మామిడి, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర జంతువు కృష్ణ జింకగా ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment