కులం, మతం అంటూ సమాజం విడిపోతున్న
ఈ రోజుల్లో హిందూ దేవాలయానికి
భద్రతా అధికారిగా ముస్లిం వ్యక్తి
నియమితులు కావడం విశేషం. అమెరికాలోని
ఇండియానా పోలీస్‌లోని ఓ హిందూ
దేవాలయానికి ప్రవాస భారతీయుడు,
జావేద్ ఖాన్ అనే వ్యక్తిని
భద్రతా అధికారిగా నియమించారు.
ముంబయికి చెందిన జావేద్ తైక్వాండో, కిక్ బాక్సింగ్‌లో ఛాంపియన్. అనంతరం 2001లో ఇండియానా పోలీస్ విభాగంలో ఉద్యోగంలో చేరాడు. ఇప్పుడు హిందూ దేవాలయానికి భద్రతా అధికారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ.. అందరి దేవుడు ఒక్కరేనని ఎవరికి ఏ రూపంలో కనిపిస్తే ఆ రూపంలో కొలుస్తారని అన్నారు. ఇక్కడకి వచ్చే భక్తులకు తాను రక్షణ కల్పించటమే తన బాధ్యత అని పేర్కొన్నారు.
జావేద్ 1986 నుంచి అమెరికాలో జరిగే మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొనడానికి భారత్ నుంచి అమెరికాకి వెళ్తుండేవాడు. 2001 నుంచి భార్యా పిల్లలతో కలిసి అక్కడే నివాసముంటున్నాడు. కొన్నేళ్ల కిత్రమే తన కూతురికి ఓ తెలుగు అబ్బాయితో అదే హిందూ ఆలయంలో వివాహం జరిపించాడు. అప్పటి నుంచి జావేద్ అంటే అక్కడివారందరికీ గౌరవభావం ఏర్పడింది.
ఇండియానా పోలీస్‌శాఖ జావేద్‌ని ఆలయ భద్రతాధికారిగా నియమించిందని ఆలయ అధికారి డాక్టర్ మోహన్ రజదాస్ అన్నారు. ఇది ప్రజలందరికీ ఒక సందేశమన్నారు.

No comments:
Post a Comment