Saturday, 23 July 2016

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 593 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొద్ది సేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. గతంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడినప్పటికీ తక్కువ పోస్టులుండటంతో నోటిఫికేషన్ వాయిదా వేశారు. అనంతరం పోస్టుల సంఖ్య పెంచి భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
 
భర్తీల వివరాలు చూస్తే..
వ్యవసాయశాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు- 62
జీఏడీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల-90
ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-28
న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు-10
పరిశ్రమలశాఖలో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు-20
కార్మిక శాఖలో అసిస్టెంట్ లేబరు ఆఫీసర్ పోస్టులు-3. ఈ పోస్టులన్నీ తెలంగాణ సర్కార్ భర్తీ చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తుండటంతో గ్రూప్-2 అధికారులు కొరత ఏర్పడుతుందని ముందుచూపుతో ఈ భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment