ఫోర్జరీకి ఎవరైతే
ఏమనుకున్నారో ఏమో? సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్నే పోర్జరీ
చేసిన ఇద్దరు వ్యక్తులు నేరుగా సీబీఐ చేతిలో చిక్కుకున్నారు. ఫోర్జరీ నేరం
జార్ఖాండ్‌కు చెందిన స్వరాజ్ కుమార్ రాయ్, ఆయన సహచరుడు సువేందు కుమార్
బర్మన్‌ను సీబీఐ పోలీసులు శనివారం అరెస్టు చేసారు. బొకారోలో ఉంటున్న
రాయ్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాబోయే
స్వాతంత్ర్య దినోత్సవం రోజున తమ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రధాని
కార్యాలయం నుంచి లెటర్ వచ్చినట్టు నిందితులు రాష్ట్ర ఉన్నతాధికారులకు
చూపించారని, అనుమానంతో విచారణ జరపగా ప్రధాని మోదీ సంతకాన్ని రాయ్ ఫోర్జరీ
చేసినట్టు తేలిందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీంతో బొకారో, బిష్ణుబూర్‌లోని
రాయ్ నివాసాలపై సీబీఐ పోలీసులు దాడులు చేసి పలు నకలీ
డాక్టుమెంట్లుస్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాకేత్ కోర్ట్స్ చీఫ్
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నిందితులను హాజరుపరచగా, వారికి
మేజిస్ట్రేట్ ఈనెల 27వరకు రిమాండ్ విధించారు.

No comments:
Post a Comment