1. బ్యాటరీలూ ఒత్తిడికి గురవుతాయి
చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి.. ఉదయం లేచిన తర్వాత తీస్తారు. అది ఏ మాత్రం మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలు చాలా సున్నితమైనవి. ఎప్పుడూ ప్లగ్ పెట్టి ఉంచితే.. ఈ బ్యాటరీలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతో త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ ప్లగ్‌ను అలాగే ఉంచడం మానుకోండి.
2. వంద శాతం అక్కర్లేదు
లిథియం అయాన్ బ్యాటరీలను పూర్తిగా నింపడం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 100శాతం నిండినప్పుడు ఓల్టేజీ అధికమై బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుందట.
3. కొద్ది కొద్దిగా..
ఒకేసారి పూర్తిగా నింపకుండా సాధ్యమైనంత మేరకు అప్పుడప్పుడు ఛార్జింగ్ పెడుతూ ఉండాలి. అలా ఒకేసారి నింపినా.. 100శాతానికి దగ్గరగా రాగానే ఆపేయాలి. ఇలా చేస్తే బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడుతుందట.
4. కూల్‌గా ఉంచండి
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు చాలా సున్నితమైనవి. వేడి తగిలితే పేలిపోయే ప్రమాదముంది. అందుకే ఎప్పుడూ ఫోన్‌ను కూల్ ఉండేలా చూసుకోవాలి. ఫోన్‌ను పూర్తిగా కవర్ చేసే కేస్‌లు వాడకుండా ఉంటే మంచిది.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీల మన్నిక పెరగడంతోపాటు.. బ్యాకప్ కూడా మెరుగుపడుతుంది.

No comments:
Post a Comment