సన్నిహితులతో
చాట్ చేసేందుకు చాలామంది వాట్సప్ తప్పకుండా వాడుతుంటారు. అయితే వాటిలో
కొన్ని వ్యక్తిగత, రహస్య చాట్‌లు కూడా ఉంటాయి. వాటిని వెంటనే డిలీట్ చేసేసి
హమ్మయ్య అని ఊరుకుంటారు. కానీ అవి పూర్తిగా డిలీట్ కావట. స్క్రీన్ నుంచి
డిలీట్ అయినట్టు కనిపించినా అదే స్మార్ట్ ఫోన్ లో ఆప్ బ్యాకప్‌లో స్టోర్
చేయబడి ఉంటాయిట. ఇది వ్యక్తిగత మెస్సేజ్ అయినా లేదా గ్రూప్ చాట్ అయినా సరే.
ఐఓయస్
పరిశోధకుడు జొనాథన్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఐపోన్ నుంచి వచ్చిన డిస్క్
ఇమేజెస్‌ను వాట్సప్ కొత్త వర్షన్‌తో పరిశీలిస్తున్నప్పుడు ఈ
విషయాన్ని కనుగొన్నాడట. డిలీట్ చేసిన సందేశాలను ఈ ఆప్ భద్రపరుస్తుందని
తెలిపాడు. దీనివల్ల తొలగించబడిన మెస్సేజ్‌లను తిరిగి పొందడానికి
అవకాశముందన్నమాట. తొలగిపోయిన మెస్సేజ్‌లను రిమోట్ బ్యాకప్ ద్వారా
కూడా పొందే అవకాశం కూడా ఉంటుందని జొనాథన్ వివరించాడు.
దీని వల్ల చింతించాల్సిన అవసరం ఉందా?
నిజానికి
సున్నితమైన వ్యక్తిగత విషయాలు వాట్సప్‌లో ప్రస్తావించకపోతే చింతించాల్సిన
అవసరం లేదు. అయినప్పటికీ వాట్సప్ గురించి పూర్తిగా తెలుసుకోవటం మంచిది.
ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి?
- డిలీట్ చేయబడిన మెస్సేజ్‌లను కొన్ని చట్టబద్ధమైన మార్గాల ద్వారా తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.
- ఇతరులు వ్యక్తులు మన ఫోన్‌లో కొన్ని మార్పులు చేసి, తేలికగా బ్యాకప్ ఏర్పాటు చేయగలుగుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఫింగర్ ప్రింట్, పాస్ కోడ్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి.
- మన కంప్యూటర్‌ను ఎవరైనా ఉపయోగిస్తే మన రహస్య మెస్సేజ్‌లను చూడటానికి లేక డిలీట్ చేసిన వాటిని రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతకుముందే ఉన్న బ్యాకప్ ద్వారా కానీ లేదా ఎన్‌స్క్రిప్ట్ చేయబడని బ్యాకప్ ద్వారా గానీ తిరిగి పొందుతారు. కొన్ని పాస్‌వర్డ్ బ్రేకింగ్ టూల్స్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్‌ను తిరిగి పొందేందుకు కూడా అవకాశముంది.
- వాట్సప్ అప్‌డేటెడ్ వర్షన్ రాకముందు ఈ అవకాశం ఉండేది కాదు.

No comments:
Post a Comment