Friday, 22 July 2016

ఛీ.. ఛీ ప్రపంచంలో ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవరైనా ఇస్తారా?

పెన్సిల్వేనియా: బహుశా ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ప్రపంచంలో ఎక్కడా ఎవరూ ఇచ్చి ఉండరేమో. తన సోదరుడికి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని భావించిన ఓ విద్యార్థి ఏం ఇవ్వాలో తెలియక తన టీచర్‌ను సంప్రదించాడు. ఆమె అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. కోర్టులో ఆమె దోషిగా తేలితే 17 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటంటే..
 
అమెరికాలోని మిల్టన్‌కు చెందిన చెల్సియా లార్సన్(25) తన విద్యార్థి సోదరులకు ‘బర్త్ డే గిఫ్ట్‌’గా వారితో శృంగారంలో పాల్గొంది. రెండు వేర్వేరు సందర్భాల్లో 17, 15 ఏళ్ల బాలలతో కారులో శృంగారంలో పాల్గొంటూ తన విద్యార్థి కోరికను తీర్చింది. లూయిస్ బర్గ్ ప్రాంతంలోని హైస్కూలు విద్యార్థి తన ఫేస్‌బుక్ నుంచి టీచర్‌కు ఓ పోస్టు పెట్టాడు. తన సోదరుడికి ‘బర్త్ డే గిఫ్ట్’ ఇవ్వాలని అందులో కోరాడు. దీనికి ఆమె అంగీకరించి రెండు వేర్వేరు సందర్భాల్లో బాలుడి సోదరులతో శృంగారంలో పాల్గొన్నట్టు బఫెలో వ్యాలీ రీజనల్ పోలీసులు కోర్టుకు తెలిపారు. లార్సన్‌ అప్పటికే సుఖ వ్యాధులతో బాధపడుతోందని, ఆ విషయాన్ని దాచిపెట్టి మరీ వారితో శృంగారంలో పాల్గొందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం లార్సన్ మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు ఎదుర్కొంటోంది. ఆమె దోషిగా తేలితే కనుక 17 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment