ప్రపంచంలోనే అతిపెద్ద
పైరసీ వెబ్‌సైట్ ‘కిక్‌యాస్ టోరెంట్స్’ (క్యాట్) రింగ్ లీడర్
ఆర్టెమ్ వాలిన్ (30) పోలండ్‌లో బుధవారం అరెస్టయ్యాడు. దరిదాపుగా రూ.6,724
కోట్ల విలువ చేసే సినిమాలు, సంగీతం తదితరాలను చట్టవిరుద్ధంగా ఇతడు కాపీ
చేసినట్లు అభియోగం. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతానికి చెందిన ఇతడిపై
అమెరికా న్యాయ శాఖ క్రిమినల్ ఫిర్యాదు చేసింది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన,
మనీలాండరింగ్ తదితర అభియోగాలు మోపింది.
వాలిన్‌ను
తనకు అప్పగించాలని కోరింది. పైరేట్ బే తదితర పైరసీ సంస్థలన్నిటినీ
దెబ్బతీసి ‘క్యాట్’ను పైరసీ మీడియాకు అతిపెద్ద వనరుగా వాలిన్ మలిచాడని
అసిస్టెంట్ అటార్నీ జనరల్ లెస్లీ కాల్డ్‌వెల్ తెలిపారు. సినిమాలు,
వీడియో గేమ్‌లు, టెలివిజన్ గేమ్‌లు, సంగీతం మొదలైనవాటిని డిసి్ట్రబ్యూషన్
చేసే క్యాట్.. ఇంటర్నెట్‌లో అందరూ సెర్చ్ చేసే 69వ వెబ్‌సైట్‌గా
పేరుతెచ్చుకుంది. 28 భాషల్లో సేవలు అందిస్తోంది. థియేటర్లలో ఆడే సినిమాలను
కూడా నెట్‌లో అందుబాటులోకి తెస్తోంది. ఈ వెబ్‌సైట్ విలువ రూ.363 కోట్లు
ఉండొచ్చని అంచనా. ఏటా వాణిజ్య ప్రకటనల నుంచి సుమారు రూ.150 కోట్ల వరకు
ఆదాయం వస్తోంది. షికాగోలోని ఫెడరల్ కోర్టు ఇప్పటికే వాలిన్‌కు చెందిన ఓ
బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఉన్న ఏడు డొమైన్
నేమ్స్‌ను కూడా స్తంభింపజేసింది.

No comments:
Post a Comment