Wednesday, 27 July 2016

మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదాలు...

మద్యంమత్తులో వాహనాలు నడపటం వల్లనే అధికశాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ.రంగనాథ్‌ అన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కఠినశిక్షలు విధించటం ద్వారా సమస్యను అధిగమిం చవచ్చన్నారు.  
ఈ నెల 1వతేదీ పంజా గుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యతోపాటు మరో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌ విద్యార్థులు తప్పతాగి వాహనం నడపటం వల్లనే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారిం చారు. దీంతో నగరపోలీసులు, ట్రాఫిక్‌ యంత్రాగం మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు సిద్ధమ య్యాయి.
దీనిలో భాగంగా మంగళవారం నాంపల్లి కోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోని మెట్రో పాలిటిన్‌ స్పెషల్‌ జడ్జి(ఎం.ఎస్‌.జె హైదరాబాద్‌) రజని తదితర న్యాయమూర్తుల ఎదుట ట్రాఫిక్‌పోలీసులు బ్రీత ఎన్‌లైజర్‌ పరీక్షపై డెమో ప్రదర్శించారు. శాసీ్త్రయంగా రక్తంలో ఆల్కాహాల్‌ను ఏ విధంగా గుర్తిస్తారనేది తెలిపారు. బ్లడ్‌ఆల్కాహాల్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ (బీఏసీ) ఏయే స్థాయిలో ఉంటే.. వాహనచోదకుడు ప్రమాదాలకు కారణమవుతాడనేది వివరించారు. ఆగస్టు 1 నుంచి అమలు
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి విధించే శిక్షాకాలాన్ని పెంచమని న్యాయమూర్తులను కోరినట్లు డీసీపీ రంగనాథ్‌ తెలిపారు. పగటి సమయాల్లో చిక్కే వారికి కఠినశిక్షలు విధించాలనే భావిస్తున్నాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేయకుండా పూర్తిగా కట్టడి చేయాలన్నదే లక్ష్యమని స్పష్టంచేశారు. ఆగస్టు 1 నుంచి లైసెన్స్‌ లేకుండా వాహనాలను నడిపే వారిని కూడా కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment