బెంగళూరు :
దేశవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్
టాపిక్ ‘కబాలి’. శుక్రవారం
ప్రపంచవ్యాప్తంగా 10వేల థియేటర్లలో
ఈ చిత్రం విడుదలకానున్న సంగతి
తెలిసిందే. బెంగళూరులోని కొన్ని
ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో కూడా
‘కబాలి’ విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే అధికారులు మాత్రం ఇందుకు
అనుమతి ఇవ్వలేదు. ఫైవ్‌స్టార్
హోటల్స్‌లో సినిమా విడుదలకు
అనుమతి ఇవ్వాలని బెంగళూరు అర్బన్
డిప్యూటీ కమిషనర్‌కు డిస్ట్రిబ్యూటర్స్
దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనలకు
విరుద్ధంగా ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో
సినిమా విడుదల చేయకూడదని ఆ దరఖాస్తును
తిరస్కరించారు.
‘కబాలి సినిమా విడుదల కోసం ఫైవ్‌స్టార్ హోటల్స్ పెట్టుకున్న దరఖాస్తును డిప్యూటీ కమిషనర్ వి.శంకర్ తిరస్కరించారు. కర్ణాటక సినిమా చట్టం, కర్ణాటక సినిమాస్ నిబంధనలు ఇందుకు అంగీకరించవు. కేవలం థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే విడుదలకు అనుగుణంగా నిబంధనలు ఉన్నాయి. దీంతో హోటల్స్‌లో సినిమా విడుదలకు అనుమతి నిరాకరించారు’ అని అధికార వర్గాలు తెలిపాయి.
కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక స్టేట్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్లు హోటల్‌లో సినిమా విడుదలపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సీబీఎఫ్‌సీ నిబంధనలకు అది విరుద్ధమని పేర్కొన్నాయి. అధికారుల నిర్ణయంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారి సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని హోటల్ యాజమాన్యాలు తెలిపాయి.

No comments:
Post a Comment