ఖమ్మం
జిల్లా భద్రాచలంలో గోదావరి అంత్యపుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
పుష్కరాల సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక
ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి
ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రం నుంచి ప్రచారమూర్తులు,
శ్రీపాదుకలు, చక్రపెరుమాళ్లను సమస్త మంగళవాయిద్యాలతో శోభాయాత్రగా
గోదావరికి తీసుకెళ్లి పూజలు చేశారు. ఉదయం 6గంటల నుంచి 7.30 వరకు సంకల్పం,
నదీపూజ, శ్రీరామానుజాచార్య స్వామివారికి అభిషేకం, సామూహిక పుష్కరస్నానం
నిర్వహించారు. దేశంలో 13పుణ్య నదులకు పుష్కరాలు జరుగుతాయి. వీటిలో
గోదావరి నది పుష్కరాలు ప్రధానమైనవి. ఈ నదికి గతేడాది జూలై 14 నుంచి 25
వరకు ఆది పుష్కరాలు జరిగాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు 11 వరకు అంత్య పుష్కరాలు
నిర్వహిస్తారు. ఉత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు,
జిల్లా జడ్జి విజయమోహన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ,
రామాలయం ఈవో రమేశ్ బాబు, ప్రధానర్చకులు జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment