Wednesday, 27 July 2016

గుండెపోటుతో దెబ్బతిన్న హృదయానికి మూలకణ చికిత్స

గుండెపోటు బాధితులకు మూలకణ చికిత్స విషయంలో పరిశోధకులు మరో ముందడుగు వేశారు. మానవ మెసెన్‌కైమల్‌ మూలకణాల్ని గుండెపోటుతో దెబ్బతిన్న గుండెకు అందించడం ద్వారా ముప్పు తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె కండరాల మరమ్మతుకు, పునరుజ్జీవనానికి, మూలకణ చికిత్సల్ని మెరుగుపరిచేందుకు సరికొత్త వ్యూహాల్ని తాజా పరిశోధన ద్వారా రూపొందించారు. మౌంట్‌ సినాయ్‌లో ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు జోషువా మేయూరియన్‌ మూలకణాలు, గుండె కణాల మధ్య విద్యుత్తు అనుసంధానతల ప్రేరణ కోసం గణిత నమూనాను ఉపయోగించారు. ఈ అధ్యయనంతో మూలకణ థెరపీ తీసుకునే గుండెపోటు బాధితులకు రక్షణ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో గుండె వైఫల్య బాధితులకు మెరుగైన చికిత్సలకూ దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment