అదేదో పండగలాగా సందడి.. అభిమానుల్లో! ఇండియా వరల్డ్ కప్పు కొట్టినంత హడావుడి.. మీడియాలో!!
కొత్తల్లుడు మొదటిసారి వస్తున్నప్పుడు అత్తమామలు పడేంత టెన్షన్..
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో!
దుక్కి దున్నగానే పంట చేతికొచ్చినంత ఆనందం..
కారణం
ఒక్కటే.. ‘కబాలి’ విడుదల నేడే! హద్దుల్లేని రజనీ మేనియాతో ప్రపంచ
ఊగిపోతోంది! థాయ్‌లాండ్, మలేసియా, జపాన్, అమెరికా.. దేశదేశాల్లో 3900
స్ర్కీన్లపై బహుళ భాషల్లో తలైవా విశ్వరూపం ప్రదర్శించనున్నాడు! ఇక తమిళనాట
టికెట్ల కోసం ఏకంగా మంత్రుల కార్యాలయాల నుంచే వినతి పత్రాలు.. విత
అఫీషియల్ స్టాంప్ వెళ్తున్నాయి! అయినా టికెట్లు దొరుకుతాయన్న నమ్మకం
లేదు. చెన్నైలో ఉండే ప్రముఖులకు టికెట్లు దొరక్క కోయంబత్తూరు
సైడెళ్లిపోతున్నారు. అక్కడ డబ్బా థియేటర్లలోనైనా సరే.. కబాలి ఫస్ట్ షో
చూడాల్సిందేనన్న తపన అది. చూడకపోతే ఏమీ కాదు.. వచ్చేవారమైనా చూడొచ్చు. కానీ
రజనీ క్రేజ్ అది!
సుల్తాన్‌ని కాదు.. బాద్‌షాని దాటాలి!!
క్యా ట్వీట్ హై!
అంకెల్లో కబాలి
క్షీరాభిషేకం వద్దు.. ప్లీజ్
రజనీకాంత కటౌట్లకు అభిమానులు భారీగా క్షీరాభిషేకాలు చేస్తుండడం పట్ల తమిళనాడు పాల వినియోగదారుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అభిమానం పేరిట ఇలా పాలను వృధా చేయరాదని ఆ సంఘం విజ్ఞప్తి చేయడంతో పాటు సినీ హీరోలంతా తమ అభిమానులకు ఈ మేరకు సూచించాలని కూడా అందులో పేర్కొంది. అయితే వారు ఇలా విజ్ఞప్తి చేయడానికి కారణం వృథా అయిపోతున్నాయన్న బాధ కాదని సమాచారం. ఇళ్ల ముందు వేసిన పాల ప్యాకెట్లన్నింటినీ అభిమానులు క్షీరాభిషేకాల కోసం ఎత్తుకెళ్లిపోవడమేనని.. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడల్లా ఇలా పాలపేకెట్ల దొంగతనాలు పెరిగిపోవడం సహజమని తెలుస్తోంది.
కొత్తల్లుడు మొదటిసారి వస్తున్నప్పుడు అత్తమామలు పడేంత టెన్షన్..
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో!
దుక్కి దున్నగానే పంట చేతికొచ్చినంత ఆనందం..
విడుదలకు ముందే లాభాలు పొందిన నిర్మాతల్లో!!
సుల్తాన్‌ని కాదు.. బాద్‌షాని దాటాలి!!
ఇటీవలే
విడుదలైన సుల్తాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వసూలైన ఓపెనింగ్ రోజు
కలెక్షన్లు 36 కోట్లు. కబాలి దీన్ని దాటేసి రూ.40 కోట్లు సాధిస్తుందని
అంచనా. అంతకుముందు.. సల్మాన్‌ఖాన్ హీరోగానే విడుదలైన ప్రేమ్ రతన్
ధన్‌పాయో తొలిరోజు రూ.40 కోట్లు, దానికన్నా ముందు షారుక్‌ఖాన్ హీరోగా
విడుదలైన హ్యాపీ న్యూ ఇయర్ రూ.44 కోట్లు సాధించడం గమనార్హం. సో.. కబాలి
టార్గెట్ సుల్తాన్ మాత్రమే కాదు. బాలీవుడ్ బాద్‌షా (షారు క్) కూడా!!
- చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న సుప్రసిద్ధ కపాలీశ్వర ఆలయ పూజారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక వ్యక్తి ఆయన్ను.. ‘‘ఏ గుళ్లో పూజ చేస్తారు స్వామీ’ అని అడిగాడు. ‘కబాలీ...డా’ ..అంటూ సమాధానమిచ్చారా శాస్త్రిగారు!!
- బాలీవుడ్ ఖాన్లు పండగరోజు, సెలవులు చూసుకుని సినిమా విడుదల చేస్తారు. తలైవా.. తన సినిమా విడుదల రోజునే పండగగా, సెలవుగా మార్చేస్తాడు.
- ప్రపంచంలో అత్యంత కష్టసాధ్యమైన పనేంటి? ఎ: గుర్రపు కొమ్ము (యూనికార్న్ హార్న్) సాధించడం. బి: కబాలి టికెట్లు సాధించడం.
అభిమానం
ఉప్పొంగినప్పుడు తర్కం తలొంచాల్సిందే. ఇది రజనీస్ ఫస్ట్ అండ్ ఫరెవర్
లా! ఎవరు అవునన్నా కాదన్నా రజనీ ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక ఫినామినా.
అందుకే.. రూ.100 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించిన కబాలి సినిమా విడుదలకు
ముందే రూ.200 కోట్లకు పైగా సంపాదించింది. లెక్కలు కావాలా.. అవీ ఉన్నాయ్. ఈ
సినిమా ఓవర్సీస్ రైట్లు రూ.30 కోట్లు. తెలుగు హక్కులు రూ.30 కోట్లు.
కన్నడ, మలయాళ హక్కులు రూ.15 కోట్లు. హిందీ శాటిలైట్ హక్కులు రూ.16 కోట్లు,
హిందీ థియేట్రికల్ (థియేటర్లలో విడుదల) హక్కుల ధర రూ.15 కోట్లు. ఇక..
తమిళనాడులో రూ.65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. తమిళనాట
శాటిలైట్ హక్కులు మరో రూ.30 కోట్లు. మ్యూజిక్ రైట్స్.. రూ.5 కోట్లు.
అన్నీ కలిపితే.. 206 కోట్లు. ఇక కబాలీ సినిమా బ్రాండింగ్ టై-అ్‌పల ద్వారా
సంపాదించిన సొమ్ము వేరే. మొత్తమ్మీద.. కబాలీ సినిమా రూ.500 కోట్లకు పైనే
సంపాదిస్తుందని నిర్మాత కలైపులి ఎస్.థాను బహిరంగంగానే ప్రకటించారు.
మరోవైపు..
తమిళనాడు తలైవా ఫీవర్‌తో ఊగిపోతోంది. కబాలి కటింగ్‌లు.. టీషర్టులతో యువత
రజనీ జపం చేస్తున్నారు. తలైవర్ కటౌట్లకు క్షీరాభిషేకాలు.. ఆలయాల్లో పూజలు,
అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తున్నారు. మరోవైపు.. కర్ణాటకలో ఈ సినిమా
ప్రదర్శనపై కన్నడ సినిమా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం
అమల్లో ఉన్న నియమాల ప్రకారం.. పరభాషా చిత్రాలు విడుదలైన ఏడు వారాల తర్వాతనే
కర్ణాటకలో ప్రదర్శించాలని గుర్తుచేస్తున్నారు. వారి ఆందోళన సంగతి అలా
ఉండగా.. బెంగళూరులోని ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఈ సినిమాను ప్రదర్శించాలన్న
డిస్ట్రిబ్యూటర్ల యోచనకు స్థానిక అధికారులు అడ్డుకట్ట వేశారు. అందుకు
అనుమతి నిరాకరించారు.
అంకెల్లో కబాలి
- 156: ఇది రజనీ 156వ సినిమా.
- 3900: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ‘కబాలి’ సినిమా ప్రదర్శించబోయే స్ర్కీన్లు.
- 400: అమెరికాలో చిత్రాన్ని ప్రదర్శించే స్ర్కీన్లు. వీటిలో సగం తెలుగు, సగం తమిళ్.
- 1000: ఉత్తరాదిన కబాలి హిందీ వెర్షన్ 1000 స్ర్కీన్లలో విడుదల అవుతోంది.
- 290 కోట్లు: ఇప్పటిదాకా తమిళనాట ఒక సినిమా సాధించిన అత్యధిక వసూళ్లు. ఈ రికార్డు రజనీ సినిమానే అయిన ‘రోబో’ పేరిట ఉంది.
- 100 కోట్లు: సుల్తాన్ సినిమా మూడు రోజుల్లో సాధించిన వసూళ్లు. అంతకుముందు ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్, బజ్‌రంగీ భాయీజాన్, ప్రేమ్ రతన్ ధన్‌పాయో కూడా ఇదే ఫీట్ సాధించాయి. కబాలి.. రిలీజ్‌కు ముందే 200 కోట్లు మార్కు దాటేసింది కాబట్టి పోటీయే లేదు.
క్షీరాభిషేకం వద్దు.. ప్లీజ్
రజనీకాంత కటౌట్లకు అభిమానులు భారీగా క్షీరాభిషేకాలు చేస్తుండడం పట్ల తమిళనాడు పాల వినియోగదారుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అభిమానం పేరిట ఇలా పాలను వృధా చేయరాదని ఆ సంఘం విజ్ఞప్తి చేయడంతో పాటు సినీ హీరోలంతా తమ అభిమానులకు ఈ మేరకు సూచించాలని కూడా అందులో పేర్కొంది. అయితే వారు ఇలా విజ్ఞప్తి చేయడానికి కారణం వృథా అయిపోతున్నాయన్న బాధ కాదని సమాచారం. ఇళ్ల ముందు వేసిన పాల ప్యాకెట్లన్నింటినీ అభిమానులు క్షీరాభిషేకాల కోసం ఎత్తుకెళ్లిపోవడమేనని.. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడల్లా ఇలా పాలపేకెట్ల దొంగతనాలు పెరిగిపోవడం సహజమని తెలుస్తోంది.

No comments:
Post a Comment