దర్భంగా: దేశ
వ్యాస్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీహార్‌లో ఈ
సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి. బీహార్‌లో ఓ మహిళ మంత్రాలు చేస్తున్నదనే నెపంతో
తన యూరిన్‌ని తనకే తాగిపించారు ఓనలుగురు వ్యక్తులు. బీహార్‌లోని దర్భంగా
జిల్లా పిప్రా గ్రామంలో చోటుచేసుకుంది ఈ సంఘటన. ఈ సంఘటనపై తమ గ్రామంలోని
పిల్లలు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారని, దానికి ఆ దళిత మహిళే కారణం
అని వారు ఆరోపించినట్లు స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజని కుమార్
తెలిపారు. ఆ కారణం చేతనే గురువారం ఆ దళిత మహిళకు బలవంతంగా యూరిన్‌ని
తాగించారని పేర్కొన్నారు. ఈ చర్యకు కారకులైన వారపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని
ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఊరు విడిచి వెళ్లిపోయిందని
తెలిపారు.
స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంజని కుమార్ తెలిపారు.

No comments:
Post a Comment