దాహార్తిని తీర్చి మెరుగైన
ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది కొబ్బరి బోండాం మాత్రమే. కలుషితం లేని
స్వఛ్ఛమైన కొబ్బరి బొండాం నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరి
బొండాం నీటిని వారం క్రమం తప్పకుండా పరగడుపున తీసుకుంటే.. అద్భుతమైన
ప్రయోజనం.
- పరగడుపున కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి బొండాం తోడ్పడుతుంది.
- శీతాకాలంలో కూడా కొబ్బరి బోండాం తాగడం వల్ల.. జలుబు రాకుండా ఉంటుంది.
- కొబ్బరిబొండాన్ని వారం పాటు పరగడుపున తీసుకుంటే ఇంతకు ముందు లేని ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
- కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్లు కూడా క్రమేపి తగ్గుతాయి.
- కొబ్బరి బోండాం నిత్యం తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
- శరీరానికి కావలసిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.
- వారం పరగడుపున రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బోండాం తాగితే కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.
- కొబ్బరినీళ్లు తాగితే.. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
- చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులపాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.
- తల్లి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదలకు చక్కగా పని చేస్తుంది.
- గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్బాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
- కొబ్బరినీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికీ తోడ్పడతాయి.
- కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మంపై ముడతలు రావడం తగ్గి, వయసు తక్కువగా కనపడుతుందంటున్నారు బ్యూటీషియన్లు.
No comments:
Post a Comment