Wednesday, 20 July 2016

తాగొచ్చిన భర్తపై భార్య వినూత్న ప్రయోగం..

భర్త తాగడం.. భార్య గొడవపడటం సహజమే. కొందరు సతీమణులు భర్తలతో తీవ్రంగా గొడవ పడతారు. ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తారు.. మహా అయితే కంట్లో కారం పెడతానని తిడతారు. అయితే మద్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ భార్య తాగొచ్చిన తన భర్త కంట్లో కారం కాదు కదా.. నిజంగానే ఫెవిక్విక్ గమ్ పోసేసింది. అంతే దీంతో నిద్రలేచిన భర్త సంతోష్ విశ్వకర్మకు దిమ్మ తిరిగింది. రోజూలాగే లేవగానే కళ్లు తెరుచుకోవడంలేదు. భార్య విజయలక్ష్మిని పిలవగా స్పందించలేదు. నీళ్లతో శుభ్రం చేసినా ఫలితం లేకపోయింది. తన కళ్లు తెరుచుకోక తెగ ఇబ్బంది పడ్డాడు.
అతనికి సాయం చేసేందుకు ఇరుగు పొరుగు వారు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మూసుకున్న కళ్లు ఫెవికిక్ గమ్ కారణంగా తెరుచుకోవడంలేదు. దీంతో పోలీసులు సాయంతో డాక్టర్ వద్దకు వెళ్లగా కళ్లకు అంటుకున్న జిగురుకు వేడి తగిలేలా చేసి చివరకు కళ్లు తెరుచుకునేలా చేశారు. కళ్లకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు సంతోష్ విశ్వకర్మ . ఇంతకీ అతనికి బుద్ది వచ్చిందో లేదో కానీ తన భార్య విజయలక్ష్మీ మాత్రం ఇంటి నుంచి పారిపోయింది.

No comments:

Post a Comment