Monday, 25 July 2016

బాలిక మానం ఖరీదు రూ.లక్ష ?

చిత్తూరు నగరంలో ఓ బాలిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ విషయం ఆదివారం వెలుగుచూసింది. ఈ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం యువకుల కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలతో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం. వివరాలిలా... చిత్తూరు నగరంలోని ఓ దళితవాడకు చెందిన బాలిక(12) శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బహిర్భూమికోసం సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఏడ్చుకుంటూ వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. అయితే అత్యాచారం చేసిన యువకుల కుటుంబసభ్యులు ఈ విషయం బయటరాకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబసభ్యులతో గ్రామ పెద్దల ద్వారా రాజీయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇందుకు గానూ బాలిక కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లిస్తామని చెప్పినట్టు తెలిసింది. జిల్లా పోలీసు అధికారులు స్పందించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

No comments:

Post a Comment