అర్హులెవరో?
అనర్హులెవరో తేలని పరిస్థితి
అంతర్‌రాష్ట్ర సమస్యగా మారిన వైనం
మరో 2 నెలల్లో 2.75 లక్షల కార్డులకు మంగళం!
ఇప్పటికే రద్దుచేసిన తెలంగాణ
తొమ్మిదేళ్ల
వై.శరణ్ తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్ మూసాపేటలో ఉంటున్నాడు.
అయితే ఆ బాలుడి ఆధార్ నెంబరు 3405 6059 0440ను మాత్రం విశాఖపట్నంలోని
డబ్ల్యూఏపీ0383324బి0453 నెంబర్ రేషన్ కార్డుకు అనుసంధానం చేశారు.
శరణ్ తండ్రి ముసాపేటలో రేషన్ తీసుకోవడానికి చౌకధరల దుకాణానికి
వెళితే కార్డులోని కుటుంబసభ్యుల ఆధార్ నెంబర్లు బోగస్‌వని, ఈ నెంబర్లు
వేరేచోట అనుసంధానం చేశారని చెప్పిన డీలర్ సరకులు ఇచ్చేది లేదన్నారు.
అదెలా జరిగిందని శరణ్ తండ్రి నారాయణరావు విచారిస్తే.. చివరికి విశాఖపట్నంలో
ఒక కార్డుకు వారి ఆధార్ సంఖ్యలు అనుసంధానం అయినట్లు తెలుసుకున్నారు.
అక్కడ ఆ కార్డులో తమ పేర్లను తొలగించి మూసాపేటలో సరకులు ఇప్పించాలని
వివిధ కార్యాలయాలు చుట్టూ ఆయన తిరిగినా పరిష్కారం మాత్రం దొరకలేదు.
అంతర్‌రాష్ట్ర సమస్యగా మారిన వైనం
మరో 2 నెలల్లో 2.75 లక్షల కార్డులకు మంగళం!
ఇప్పటికే రద్దుచేసిన తెలంగాణ
* హైదరాబాద్ యాఖత్‌పురాలోని ఇస్మాయిల్ ఆధార్ సంఖ్య 258945361266ను విశాఖపట్నం 185వ చౌకధరల దుకాణ పరిధిలోని రఫీ అనే కార్డుదారుడి కార్డుకు అనుసంధానం చేశారు.
* అదే యాఖత్‌పురలోని న్యాలకంటి నర్సింలు కార్డు డబ్ల్యూఏపీ167111302098లోని ముగ్గురు సభ్యుల ఆధార్ సంఖ్యలను విశాఖ జిల్లా ఎలమంచిలిలోని కొమ్మాజీ పరమేశ్వరరావు కార్డుతో అనుసంధానం చేసినట్లు గుర్తించారు.
ఇలాంటి ఆధార్ అనుసంధానం సమస్యలు కేవలం ఈ మూడే కాదు. 2 రాష్ట్రాల మధ్య 3.90 లక్షల కార్డులకు సంబంధించి ఇలాంటి సమస్యలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే వీరిలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది మాత్రం ఇంతవరకూ తేల్చలేదు. ఈ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇ-పాస్‌లో నమోదుచేయించుకుని (అథెంటికేషన్ ఇచ్చి) సరకులు తీసుకున్న కార్డులు 87వేలు. 25వేల కార్డుదారులు తెలంగాణలో సరకులు తీసుకుంటున్నారని వారి కార్డులను ఆంధ్రప్రదేశ్‌లో తొలగించాలని తెలంగాణ సర్కారు ఏపికి ప్రతిపాదనలు పంపింది. వాటిని ఆంధ్రప్రదేశ్‌లో తొలగించారు కూడా. దీంతో సుమారు 1.15 లక్షల కార్డులను సర్దుబాటు చేశారు. కేవలం ఆధార్ సంఖ్య చివరగా ఎక్కడ వాడారో దాని ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన 2.75 లక్షల కార్డులు అర్హులవా? లేక డీలర్లు సృష్టించిన బోగస్‌కార్డులా అనేదీ తేలలేదు. కానీ, సరకుల పంపిణీ పూర్తిస్థాయిలో జరుగుతూనే ఉంది. తెలంగాణలో మాత్రం ఈ 2.75లక్షల కార్డులను రద్దు చేసేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వాటి వివరాలను పరిశీలన నిమిత్తం జిల్లాలకు పంపారు. రెండు నెలల్లోగా జిల్లాల నుంచి స్పందన రాకపోతే ఈ 2.75 లక్షల కార్డులను పూర్తిగా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.

No comments:
Post a Comment