Sunday, 24 July 2016

ఆరోగ్యానికి "రోజ్" టీ

  కావాల్సిన పదార్ధాలు :-
 1) రోజ్ పెటల్స్ (ఫ్రెష్ లేదా ఫ్లవర్స్ ఎండబెట్టి పౌడర్ చేసి నిల్వ చేసుకోవాలి)
2) సోంపు గింజలు - 1 స్పూన్

తయారీ విధానం :- 
1) ఒకటిన్నర గ్లాస్ వాటర్ లో కొన్ని ఫ్రెష్ రోజ్ పెటల్స్ లేదా ఒక స్పూన్ ఎండబెట్టిన రోజ్ ఫ్లవర్స్ పౌడర్ , ఒక స్పూన్ సోంపు గింజలు వేసి , ఒక గ్లాస్ వాటర్ మిగిలేవరకు మరిగించి , వడపోసి తీసుకోవాలి.
రెండు పూటలా భోజనం తర్వాత లేదా భోజనానికి ముందు తీసుకోవచ్చు! దీనిలో చిటికెడు ఇలాచీ పౌడర్ & 1 స్పూన్ హనీ కూడా వేసుకొని తీసుకోవచ్చు!

ఆరోగ్య ప్రయోజనాలు :-
 1) A , B , C , E , K విటమిన్స్ శరీరానికి అందుతాయి.
2) శరీరం లో పేరుకుపోయిన టాక్సిన్స్ (వ్యర్ధాలు) బయటికి విడుదల అవుతాయి.
3) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
4) మైండ్ ఫ్రెష్ అయ్యి , ఒత్తిడి తగ్గుతుంది.
5) కొలెస్ట్రాల్ & డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
6) స్త్రీల రుతుక్రమం మెరుగుపడుతుంది.
7) చర్మం అందంగా & ఆరోగ్యంగా ఉంటుంది.
8) గ్యాస్ సమస్యలు తగ్గి , జీర్ణవ్యవస్థ శుద్ధి చెందుతుంది.

No comments:

Post a Comment