Friday, 22 July 2016

బాహుబలి రికార్డును బద్దలుకొట్టిన కబాలి..

అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షో కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా కబాలి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో అంతకుముందు బాహుబలి పేరిట ఉన్న రికార్డు బద్దలయ్యింది. అమెరికాలో బాహుబలి 1.38 మిలియన్ డాలర్లు(9.26 కోట్లు రూపాయిలు) వసూలు చేసింది. అయితే తాజాగా కబాలి దాన్ని మించి 2 మిలియన్ డాలర్లను(13.4 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. 
కబాలి ఇండియాలో జులై 22న రిలీజైతే అమెరికాలో ఒకరోజు ముందే 21న విడుదలై ప్రీమియర్ షోతో కుదిపేసింది. దీంతో అమెరికాలో ప్రీమియర్ షో కలెక్షన్లలో రికార్డు సృష్టించింది కబాలి. విడుదలకు ముందే నుంచే కబాలి ప్రమోషన్ పతాక స్థాయిలో జరిగింది. విమానాలపైకి సైతం ఎక్కి ఆకాశంలో విహరించింది. కబాలి ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో 12 వేల స్క్రీన్లపై విడుదలయ్యింది. ఇది కూడా ఒక రికార్డే.. ఎందుకంటే ఏ భారతీయ సినిమా ఈ రేంజ్‌లో రిలీజ్ కాలేదు.

కబాలి సునామిలో కొట్టుకుపోయిన సుల్తాన్..!

కబాలి సినిమా దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. దాదాపు సినీ ప్రపంచం మొత్తాన్ని కబాలి తన వైపుకు తిప్పుకుంది అనడం అతిశయోక్తి కాకపోవచ్చు. సినిమా ఫలితం ఎలా ఉన్నాసరే సూపర్ స్టార్ రజనీకాంత్‌కున్న క్రేజ్ ముందు అది చిన్నవిషయమే. అంతటి అభిమాన గణాన్ని కలిగి ఉన్న రజనీ మూవీ ఆన్‌లో ఉండగా దరిదాపుల్లో ఇక వేరే సినిమా రాలేదు. వాటికి తగిన న్యాయం జరగదనేది కొందరి సీనీ జనాల మాట. నిజంగానే సునామిని తట్టుకోలేక కొన్ని మూవీలు వాయిదా పడుతుంటాయి. ఇప్పుడు కబాలి పరిస్థితి కూడా అంతే. ప్రమోషన్ పతాక స్థాయిలో జరిగి, విమానాలపై ప్రపంచంలో చక్కర్లు కొట్టింది.
 
అయితే కబాలి మూవీ మానియా మొదలు కాకముందు వరకు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీ గురించే అంతటా చర్చలు నడిశాయి. సుల్తాన్‌ పేరు అంతటా వినిపించింది. అయితే ఎప్పుడైతే కబాలి గ్రౌండ్‌లోకి ఎంటర్ అయ్యిందో ఒక్కసారిగా సుల్తాన్ డౌన్ అయ్యింది. కొందరు రజనీ అభిమానులు నెట్‌లో దీనిపై విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. సుల్తాన్ సెలవు రోజున రిలీజ్ అయితే, కబాలి రిలీజ్ అయినప్పుడే సెలవు అని పోస్టులు పెట్టారు. రజనీ లాంటి వ్యక్తితో పోటీ పడాలంటే మరో జన్మ ఎత్తాలని జులై 22న విడుదలైన ‘మదారి’ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన ఇర్ఫాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ కబాలి సునామిలో సుల్తాన్ కొట్టుకుపోయిందనేది ప్రస్తుత సోషల్ మీడియాలో చర్చ.

 

 
 

No comments:

Post a Comment