ఒకేసారి
59 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు రవా ణా శాఖ సిద్ధమవుతోంది.
ఆగస్టు 2 నుంచి పూర్తి స్థా యిలో ఆన్‌లైన్ విధానాన్ని అవలంబించాలనే
లక్ష్యంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 11 ఆర్టీఏ
కార్యాలయాల్లో ఎలాంటి సేవకైనా మొదట ఆన్ లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న
తర్వాతే ఆర్టీఏ కార్యాల యానికి వెళ్లాలి. ఇంద కోసం రవాణా శాఖ వెబ్‌సైట్,
ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
మంగళవారం నుంచి నగరంలోని ఈ- సేవా కేంద్రాల్లో సిబ్బందికి ప్రత్యేకంగా
శిక్షణా తరగ తులు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ జిల్లా సంయు క్త రవాణా
కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో సుమారు 800 ఈ-సేవా
కేంద్రాలున్నాయి. అన్ని చోట్లా రవాణా శాఖ సేవలు సులభంగా, వేగంగా అందిం
చేందుకు వారం రోజుల ముందు నుంచే ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని
చెప్పారు. జూలై 15న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రవాణా శాఖ ఆటోమేటెడ్
ఆన్‌లైన్ సర్వీసెస్(ఏఓఎస్)ను ప్రారంభిం చిన విషయం తెలిసిందే.
ఆర్టీఏ
కార్యాలయాల్లో పనులు అంటేనే ఏజెంట్లను సంప్రదించాలా అనే ఆలోచనకు
ఆటోమేటెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్ విధానం పుల్‌స్టాప్ పెట్టనుంది. విద్యా
వంతు లతో పాటు నిరక్ష్యరాస్యులు సైతం ఆన్‌లైన్ ద్వారా సేవలు సులభంగా
పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా శాఖ అందించే 59 రకాల సేవలపై
ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను, పోస్టర్లను ముద్రిస్తోంది.

No comments:
Post a Comment