Wednesday, 27 July 2016

మీ సెల్‌ఫోన్‌లోకి ఇతరులు తొంగి చూస్తున్నారా!

మీరు స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నప్పుడు ఇతరులు మీ ఫోన్‌లోకి తొంగి చూస్తున్నారా? అది మీ ప్రైవసీకి భంగం కలిగిస్తుందా? ఇతరులు మన ఫోన్‌ను చూడకుండా ఉండేందుకు కొత్త పరికరాన్ని కనుగొన్నారు. సెలల్‌ గోగర్‌ అనే ఈ ప్రత్యేక కళ్లజోడు ధరిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌ తెర మీకు తప్ప ఇతరులెవ్వరికి కనిపించదు. టర్కీకి చెందిన గోగర్‌ మొబైల్స్‌ మెకానిక్‌. తాను ఫోన్‌ వినియోగించే సమయంలో ఇతరులు తన ఫోన్‌లోకి తొంగిచూడటంతో ఇబ్బందిగా అనిపించిన గోగర్‌ దీనికి పరిష్కారంగా ఈ కళ్లజోడును కనిపెట్టాడు. స్మార్ట్‌ ఫోన్‌ అనుసంధానంతో పనిచేసే ఈ కళ్లజోడు పెట్టుకుంటే.. ఎవరైతే కళ్లజోడు ధరించారో వారికి మాత్రమే మొబైల్‌ తెర కనిపిస్తుంది. ఫోన్‌లోకి తొంగి చూసే ఇతరులకి ఎలాంటి సమాచారం కనపడకుండా తెల్లటి తెర మాత్రమే కనిపిస్తుందట.

No comments:

Post a Comment