Saturday, 23 July 2016

నా కొడుకును క్షమించొద్దు...కాల్చేయండి...

పాకిస్థాన్ : ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకును క్షమించొద్దు... కనిపిస్తే కాల్చేయండి’’ అన్నాడో పాకిస్థాన్ దేశ మోడల్ బలోచ్ తండ్రి అన్వర్ అజీమ్. పాకిస్థాన్ మోడల్ కందీల్ బలోచ్ ను హత్య చేసిన నిందితుడైన ఆమె తమ్ముడు వసీమ్ విషయంలో ఆయన తండ్రి అన్వర్ అజీమ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. బలోచ్ ను హతమార్చిన రోజు తాను భార్యతోపాటు మేడపై నిద్రపోతున్నానని, పడుకోవడానికి ముందు తమ కొడుకైన వసీం పాలలో మత్తుమందు కలిపి ఇఛ్చాడని అజీమ్ చెప్పారు. తాము మత్తులో ఉండగా తమ కూతురు బలోచ్ ను కొడుకే గొంతు నులిమి చంపాడన్నారు. మరునాడు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసేందుకు లేవమని బిడ్డను లేపగా విగతజీవిగా పడి ఉందని తండ్రి ఆవేదనగా చెప్పారు. ఆమె గొంతు వద్ద నల్లటి చారలు కనిపించాయన్నారు. తమ కూతురు బలోచ్ మంచి అమ్మాయి అని, కాని తన కొడుకైన వసీం అన్యాయంగా ఆమెను పొట్టన పెట్టుకున్నాడని తండ్రి అజీమ్ ఆరోపించారు. తన కొడుకును కాల్చి చంపాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment