- అల్పపీడన ద్రోణి బలోపేతం
ఓవైపు
మరాఠ్వాడ, ఉత్తర తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి, మరోవైపు
విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న
అల్పపీడన ద్రోణి బలపడ్డాయి. దీంతో తెలంగాణ, రాయలసీ మ ప్రాంతా ల్లో నైరుతి
రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ రెండు ద్రోణుల ప్రభావంతో మంగళవారం
హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని హైదరాబాద్
వాతావరణ కేంద్ర డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. అల్పపీడన ద్రోణి
సముద్ర మట్టానికి 4.5 కి.మీ లోపు ఎత్తులో ఆవరించి ఉన్నందున రాష్ట్రంలో
అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇక
గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో
భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నర్మెట్టలో
11.6 సెం.మీ, భీమదేవరపల్లిలో 9.8, ధర్మసాగర్‌లో 9.2, హసన్‌పర్తి వద్ద 9,
పాలకుర్తిలో 8.2, నల్లబెల్లిలో 8, హన్మకొండలో 7.8, జనగాంలో 7.7, మోర్తాడ్,
బాల్కొండలలో 6.9, రామగుండంలో 6.8, ఆసిఫాబాద్, బాన్సువాడలలో 6.6,
మంచిర్యాలలో 6.1, భువనగిరి, భీంగల్లులో 5.6, ఆర్మూరులో 5.6, హైదరాబాద్‌లో
5.5 సెం.మీ మేరకు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
రానున్న
24 గంటల్లో తెలంగాణ, రాయలసీమలో విస్తారంగా, కోస్తాలో పలుచోట్ల వర్షాలు
కురుస్తాయని, రెండు రాష్ర్టాల్లో రెండు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం లేకపోయినా ద్రోణులు
బలపడి, రుతుపవనాలు చురుకుగా మారడంతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ
అధికారి తెలిపారు. కాగా, అల్ప పీడన ద్రోణి, తేమ గాలుల ప్రభావంతో ఉత్తర
కోస్తాలోనూ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో వర్షాలు లేకపోవడంతో ఎండ
తీవ్రత కొనసాగింది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.
No comments:
Post a Comment