Saturday, 27 August 2016

ఇకనుంచి వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్ కనిపిస్తే జైలుకే..

ఇకనుంచి వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రెస్, పోలీస్, జడ్జి, ఆర్మీ, హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోర్స్ తదితర స్టిక్కర్లు కనిపిస్తే జైలుకు వెళ్లక తప్పదు. ఆయా స్టిక్కర్లను నెంబర్ ప్లేట్లపై అతికిస్తూ నంబర్ ప్లేట్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడంపై దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించాలని నిర్ణయించారు.
పోలీస్, ప్రెస్, యాంటీ కరెప్షన్ ఫోర్స్ స్టిక్కర్లు అతికించుకుని పార్కింగ్ ఫీజులు ఎగవేస్తుండడం, కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులను బెదిరిస్తుండడంతో పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే చలాన్ల నుంచి కూడా తప్పించుకుంటున్నారు. వాహనాలపై ఆయా స్టిక్కర్లు అతికించుకుని దానిని దుర్వినియోగం చేస్తే కేసులు నమోదు చేయవచ్చని హైదరాబాద్ సిటీ క్రిమినల్ కోర్టుల అడ్వకేట్ ఎస్.ప్రదీప్ కుమార్ తెలిపారు.

పోలీసులు, రిపోర్టర్లు, జడ్జిలు కానివారు కూడా ఇటువంటి స్టిక్కర్లను అతికించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అటువంటి వారు పట్టుబడితే దుర్వినియోగం కింద కేసు నమోదు చేయవచ్చని వివరించారు.
2001లో పార్లమెంటుపై దాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులు తమ వాహనాలకు ‘ప్రెస్’ స్టిక్కర్లు అతికించుకున్న విషయం తెలిసిందే. దీంతో స్టిక్కర్ల ద్వారా భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని భావిస్తున్న అధికారులు ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించారు. తాను చాలాసార్లు ఈ విషయమై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశానని సీజే కరిరా అనే వ్యక్తి పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నంబర్ ప్లేట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్డ్ నంబర్ ప్లేటుపై ఏదైనా రాయడం, స్టిక్కర్లు అతికించడం నేరం.

ఎయిర్‌టెల్ ఆఫర్లలో ఇది భారీ సంచలనం

డేటా యూజర్లకు పండగే పండగ. టెలికాం కంపెనీలు యుద్ధం చేస్తున్నాయి. 4జీ టెక్నాలజీ సబ్‌స్క్రైబర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. పోటాపోటీగా డేటా రేట్లు తగ్గిస్తున్నాయి. కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించేందుకు తాజాగా ఎయిర్‌టెల్ సంచలనాత్మక ఆఫర్‌ను ప్రకటించింది. రూ 250కే 10 జీబీ డేటా ఇస్తామని పేర్కొంది.
జే సిరీస్ స్యామ్‌సంగ్ ఫోన్‌ను కొనేవాళ్ళకు 1 జీబీ ధరకే 10 జీబీ 4జీ డేటాను ఇస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లు, కాబోయే యూజర్లు కూడా వినియోగించుకోవచ్చునని తెలిపింది. 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో 3జీ డేటా పొందవచ్చు.

Friday, 26 August 2016

తెలంగాణ కొత్త జిల్లాల మ్యాప్‌లు విడుదల...


తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసింది. కొద్ది రోజుల క్రితం డ్రాఫ్ట్ నోటిపికేషన్ ను విడుదల చేయగా, ఇవాళ తెలంగాణ మ్యాపుతో పాటు 27 జిల్లాల మ్యాప్ లను విడివిడిగా ప్రభుత్వం విడుదల చేసింది. 



























Thursday, 25 August 2016

తల్లి గర్భంలో ఉండగానే ఆ ఇష్టం ఏర్పడుతుందట..!

కొందరికి వ్యాయామం చేయడమంటే ఇష్టం. మరికొందరు అస్సలు దాని జోలికే పోరు. అయితే వ్యాయామం పట్ల ఇష్టం లేకపోవడం వారి తప్పు కాదనీ, ఆ ఇష్టం పుట్టుకతోనే అంటే తల్లి గర్భంలో ఉండగానే ఏర్పడుతుందనీ అంటు న్నారు అమెరికా పరిశోధకులు. టెక్సాస్‌ పిల్లల ఆసుపత్రి వైద్యులు ఈ విషయంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఎలుకల మీద చేసిన పరిశోధన ద్వారా వారు పై విషయాన్ని నిర్ధారించారు. గర్భంతో ఉన్న కొన్ని ఎలుకలను ఉత్సాహంగా తిరగనిచ్చారు. మరికొన్ని ఎలుకలను కట్టడి చేసి ఉత్సాహంగా తిరగకుండా చూశారు. అవి ప్రసవించిన తరువాత పిల్ల ఎలుకల ప్రవర్తన పరిశీలించారు. ఉత్సాహంగా అటూ ఇటూ పరిగెట్టిన ఎలుకల పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా ప్రవర్తిస్తుండగా, ఉత్సాహంగా తిరగని ఎలుకల పిల్లలు స్తబ్దుగా ఉండడం వీరు గమనించారు. గర్భవతిగా ఉన్న మహిళలు ఎప్పుడూ కూర్చోకుండా అటూ ఇటూ ఉత్సాహంగా తిరిగితే పుట్టే పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా ఉంటారని వీరు అంటున్నారు. దీని మీద ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

సింగ‌పూర్‌లో డ్రైవ‌ర్ లేని ట్యాక్సీలు

ప‌్ర‌పంచంలోనే తొలిసారిగా డ‌్రైవ‌ర్ లేని ట్యాక్సీలు సింగపూర్ రోడ్ల‌పై ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. బుధ‌వారం వీటిని విజ‌యవంతంగా టెస్ట్ డ్రైవ్ చేసిన నిర్వాహ‌కులు.. గురువారం నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను రైడ్‌కు తీసుకెళ్తున్నాయి. నుటొనోమి అనే కంపెనీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను ఆప‌రేట్ చేస్తోంది. ఎవ‌రైనా స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ కారు ఫ్రీరైడ్‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే గూగుల్‌, వోల్వోలాంటి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను రోడ్ల‌పై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తున్నా.. ప‌బ్లిక్ రైడ్ ఆఫ‌ర్ చేసిన తొలి కంపెనీ త‌మ‌దేన‌ని నుటొనోమి చెబుతోంది. 
ప్ర‌స్తుతానికి ఆరు చిన్న కార్ల‌ను సింగ‌పూర్ రోడ్ల‌పై ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ఏడాది చివ‌రినాటికి వాటిని 12కు పెంచ‌నున్నారు. 2018 క‌ల్లా సింగ‌పూర్ మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఉండాల‌న్న‌ది ఈ కంపెనీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ప్ర‌పంచంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాలు కూడా త‌మ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల‌ను ఎంపిక చేసుకుంటాయ‌ని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ప్ర‌స్తుతానికి సింగ‌పూర్‌లో 6.5 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప్రాంతంలో మాత్ర‌మే ఈ కార్లు తిర‌గ‌నున్నాయి. నుటొనోమి కంపెనీ నుంచి ఆహ్వానం పొందిన ప్ర‌యాణికుల‌కే ఈ స‌ర్వీస్ ఉంటుంది. ఇప్ప‌టికే వంద‌ల మంది ఫ్రీరైడ్ కోసం అప్లై చేసుకున్నార‌ని కంపెనీ చెప్పింది. 

ఈ కార్ల‌లో రాడార్‌లా ప‌నిచేసే ఆరు సెట్ల లిడార్ల‌ను అమ‌ర్చారు. ఇవి కారుకు అన్నివైపులా రోడ్ల‌పై ఉన్న ప‌రిస్థితుల‌ను లేజ‌ర్ సాయంతో గుర్తిస్తాయి. ఇందులో ఒక‌టి కారు పైభాగంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. డాష్‌బోర్డులో రెండు కెమెరాలు అమ‌ర్చారు. ముందు వ‌చ్చే అడ్డంకులు, సిగ్న‌ళ్ల‌లో మార్పుల‌ను ఈ కెమెరాలు గుర్తిస్తాయి. ప్ర‌స్తుతానికి ఫ్రీరైడ్ అందిస్తున్నా.. త‌ర్వాత డ‌బ్బు చెల్లించాల్సి ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. నుటొనోమీ కంపెనీ సీవోవో మాట్లాడుతూ.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు సింగ‌పూర్‌లో మొత్తం కార్ల సంఖ్య‌ను 9 ల‌క్ష‌ల నుంచి 3 ల‌క్ష‌ల‌కు త‌గ్గిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు.

స‌ముద్రగర్భంలో రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి యుద్ధ‌నౌక‌...

శాన్‌ఫ్రాన్సిస్కో: స‌ముద్ర గ‌ర్భంలో అన్వేషిస్తున్న కొంద‌రు సాహ‌స యాత్రికుల‌కు రెండో ప్ర‌పంచ యుద్ధ కాలం నాటి యుద్ధ నౌక ఒక‌టి క‌నిపించింది. ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని కాలిఫోర్నియా తీరంలో ఈ యుద్ధ‌నౌక‌ను క‌నుగొన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల‌ను మోసుకెళ్లే ఇలాంటి యుద్ధ‌నౌక స‌ముద్ర గ‌ర్భంలో క‌నిపించ‌డం ఇదే తొలిసారి. యూఎస్ఎస్ ఇండిపెండెన్స్ అనే పేరు గ‌ల ఈ నౌక‌ను ప్ర‌ముఖ ఓష‌నోగ్రాఫ‌ర్ రాబ‌ర్ట్ బ‌లార్డ్ ముందుగా చూశారు. గ్రేట‌ర్ ఫారాలోన్స్ నేష‌న‌ల్ మ‌రైన్ సాంక్చురీలో కిలోమీట‌ర్ లోతులో ఈ యుద్ధ‌నౌక‌ను గుర్తించారు.


దీంతో స‌ముద్ర ప‌రిశోధ‌న నౌక నాటిల‌స్‌లో ఉన్న శాస్త్ర‌వేత్త‌లు స‌ముద్ర గ‌ర్భానికి రెండు జ‌లాంత‌ర్గాముల‌ను పంపించారు. అవి అందించిన స‌మాచారం మేర‌కు ఆ యుద్ధ‌నౌక‌లో ఓ హెల్‌కాట్ ఫైట‌ర్ ప్లేన్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గ‌న్స్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఆ నౌక‌పై ఉన్న శాంపిల్స్‌ను సేక‌రించి ప‌రీక్షించ‌నున్నారు. దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ మార్పులు, అణుబాంబుల‌ను ప‌రీక్షించ‌డం వ‌ల్ల అందులో ఇంకా ఏమైనా రేడియో ధార్మిక‌త ఉందా అన్న అంశాలు తెలుసుకునే వీలుంటుంది. ఈ యుద్ధ‌నౌక శిథిలాల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆ వీడియో మీరూ చూడండి.

కన్నయ్య చిట్టి పాదాలను కళ్ళారా చూద్దామా !


చిన్ని కృష్ణుడి లీలలను తలచుకుంటూ ఉంటే మహదానందం కలుగుతుంది. ఆయన రూపం ముగ్ధ మోహనంగా ఉంటుంది. చలాకీగా తిరుగుతూ అందరికీ ఆనందాన్ని పంచే బాలకృష్ణుడి ఆటపాటలు మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. బృందావనంలో మురళీ కృష్ణుడు నడయాడినట్లు చెప్పుకుంటున్న స్థలాలను, ఆయన పాదముద్రలను, స్నేహితులతో కలిసి భోజనం చేసిన స్థలాన్ని ఓ ఔత్సాహికుడు యూట్యూబ్‌‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ...
బృందావన్‌లోని రాధా దామోదర్ మందిరంలోని శ్రీ సింహాసనంలో చిన్న కృష్ణుడి పాద ముద్రలు ఉన్నాయని చూపించారు. సముద్ర మథనం సమయంలో గరుత్మంతుడు అమృత కలశాన్ని దాచినట్లు చెప్తున్న చెట్టును కూడా ఈ వీడియోలో చూడవచ్చు. చరణ్ పహాడీ అనే ప్రాంతంలో గోపీలోలుడైన కృష్ణుడు సంచరించినపుడు పడిన పాద ముద్రలను వీక్షించవచ్చు. ఓ చెట్టుపై రాధే కృష్ణ అని కనిపిస్తుండటాన్ని చూపించారు. చిన్ని కృష్ణుడు తన తోటి గోపాలురతో కలిసి భోజనం చేసినట్లు చెప్పుకుంటున్న స్థలాన్ని కూడా ఈ వీడియోలో చిత్రీకరించారు. బృందావనంలోని కలియా ఘాట్‌లో కూడా ముద్దులొలికే కృష్ణుడి పాద ముద్రలు ఉన్నాయని ఈ వీడియో వివరిస్తోంది. మీరూ ఆనందించండి.

బ్యాంకు ఏదైనా.. డబ్బు జమ చేయవచ్చు!

ఏదైనా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయాలంటే అదే బ్యాంకు లేదా ఆ బ్యాంకుకు చెందిన ఏదైనాశాఖకు వెళ్లి డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు తమ డిపాజిట్‌ మెషీన్‌ నుంచి ఇతర బ్యాంకుల ఖాతాలకు డబ్బు జమ చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఆంధ్రాబ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌, మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నగదు పరస్పరమార్పిడి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటీఎమ్‌లలో ఎలాగైతే డబ్బులు విత్‌డ్రా చేయగలమో అలాగే ఈ బ్యాంకుల నగదు డిపాజిట్‌ మెషీన్ల నుంచి వేరే బ్యాంకుల్లో ఉన్న ఖాతాలకు నగదును డిపాజిట్‌లు చేయవచ్చట. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ వేదికగా నగదు బదిలీ అవుతున్న నేపథ్యంలో ఆ సౌకర్యం లేని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఎన్‌పీసీఐ పేర్కొంది.

‘ఖైదీ నంబర్‌ 150’తో కాజల్‌

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబరు 150’ చిత్రం షూటింగ్‌ ఇవాళ శంషాబాద్‌ విమానాశ్రయంలో జరిగింది. కథానాయకి కాజల్‌ గురువారం షూటింగ్‌కు హాజరయ్యారు. చిరు, కాజల్‌పై ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.




యూజర్ల గుట్టును ఫేస్‌బుక్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న వాట్సప్..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ వాట్సప్ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచింది. వాట్సప్‌ను వాడుతున్న వినియోగదారుల ఫోన్ నెంబర్లను తన మాతృ సంస్థ ఫేస్‌బుక్‌కు ట్రాన్స్‌ఫర్ చేయనుందట.
 
ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు వంద కోట్లకు పైగా వినియోగదార్లున్నారు. దీంతో సదరు యూజర్ల నెంబర్లన్నీ ఇకపై ఫేస్‌బుక్‌కు చేరనున్నాయి. అయితే ఫోన్ నెంబర్లు ఫేస్‌బుక్‌కు వెళ్లాలా వద్దా అనేది యూజర్లే డిసేడ్ చేసుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్‌లో అన్‌చెక్ అనే బాక్స్‌ను టిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫేస్‌బుక్ ఈ ఫోన్ నెంబర్లను ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే చేయడం కానీ, ఇతరలకు ఇవ్వడం కానీ చేయదని హామీ ఇచ్చారు వాట్సప్. దీంతోపాటుగా వాట్సప్‌లో ఫేస్‌బుక్ తలదూర్చదని, వినియోగదారులు గోప్యత విషయంలో, యాడ్స్‌ను ప్రమోట్ చేయకుండా ఉండటం వంలి విషయాల్లో మార్పులు చేయబోమని తెలిపింది.

కృష్ణుడిగా ఆయన వద్దు

శ్రీకృష్ణుడు అనగానే.. తెలుగు ప్రజలకు గుర్తొచ్చే పేరు నందమూరి తారకరామరావు. అనేక చిత్రాల్లో ఎన్నో పౌరాణిక పాత్రలు పోషించినప్పటికీ.. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఆహార్యం, అభియం అజరామరం. కాబట్టే.. తెలుగు ప్రజలు తమ గుండెల్లో ఆయన కృష్ణుడిగా ముద్రించుకున్నారు. అయితే, ఎన్టీఆర్ వెండితెరపై కృష్ణుడిగా ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చిందట. మొట్టమొదట ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన చిత్రం 1956లో వచ్చిన ‘సొంత‌ ఊరు’. ఈ చిత్రం పరాజయం పాలైంది. ఈ చిత్రం తరువాత.. విజయా వారి బ్యానర్‌లో వచ్చిన మాయబజార్ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే, ఈ పాత్ర పోషించడానికి ఆయనకు చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఈ సినిమా దర్శకుడైన కేవీ రెడ్డీ ఈ పాత్రకు ఎన్టీఆర్‌నే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. విజయా బ్యానర్‌కు చెందిన ప్రముఖుల సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ‘సొంత ఊరు’ పరాజయం పాలైందని, ఈ సినిమా కూడా పరాజయం పాలవుతుందని, అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా వద్దని పట్టుబట్టారట. కానీ, కేవీ రెడ్డి మాత్రం సినిమా కథపై ఉన్న నమ్మకంతో ఎన్టీఆరే కావాలని అడిగాడట. దీంతో ఆలోచించిన చిత్ర నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణిలు.. సొంత ఊరులో పరాజయం పాలైనప్పటికీ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ మాత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడని భావించి కేవీరెడ్డి మద్దతు పలికారట. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలిసిందే. ఇక అప్పటి నుంచి కృష్ణుడిగా ఎన్టీఆర్ జైత్రయాత్ర గురించి తెలుగు ప్రేక్షకులకు వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ ‘విజయ’ సన్నిహితులకు కేవీ రెడ్డి, నాగిరెడ్డి మద్దతు పలికి ఉంటే.. ఎన్టీఆర్‌ని మనం ఇలా చూసే వాళ్లం కాదేమో.

నంబర్ ప్లేట్ల లొల్లి..!

కొత్త జిల్లాల ఏర్పాటేమో కానీ.. చాలానే మార్పులు జరగాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ తెర మీదకు వచ్చిన అంశాలు కొన్నే అయితే ఇంకా మార్పు చేయాల్సినవి చాలానే ఉంటాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల కారణంగా ప్రజలు సైతం పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. కొత్త జిల్లాల కారణంగా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి కొందరు లాభపడితే మరికొందరికి కష్టాలు తప్పవన్న మాట వినిపిస్తోంది.
అయితే దీని ప్రభావం ఎంతన్నదానిపై ఇప్పటికిప్పుడు స్పష్టంగా అవగాహన లేనప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాక్టికల్ గా కొన్ని కొత్త సమస్యలు తలెత్తటం పక్కా అన్న మాట వినిపిస్తోంది. వీటిలో కొత్త జిల్లాలతో వాహనాల నెంబరు ప్లేట్లు మారతాయా? అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ పది జిల్లాలుగా ఉన్న తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించేందుకు ఒక విధానం ఒకటి అమల్లో ఉంది. తాజాగా పది జిల్లాలు కాస్తా 27 జిల్లాలు మారనున్న నేపథ్యంలో ఏ జిల్లాకు ఏ నెంబరు ఇవ్వాలి? ఏ సీరిస్ ను ఫైనల్ చేయాలి? జిల్లా కోడ్ నంబర్లకు ఏ ప్రాతిపదికన కేటాయించాలి? లాంటి కీలక ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా జిల్లా పేర్ల మొదటి అక్షరం ఆధారంగా కొత్త నెంబర్లు కేటాయించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఇప్పటికే అమల్లో ఉన్న నెంబర్లు దాదాపుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల రద్దీ ఎక్కువ.. మరికొన్ని జిల్లాల్లో తక్కువ ఉన్న నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే జిల్లాల విషయంలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న అంశంపై చర్చ జరగాల్సి ఉందన్న భావన వ్యక్తమవుతోంది.
వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్ల విషయంలో రానున్న రెండు వారాల వ్యవధిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. ఇప్పటికున్న నెంబర్లు కాకుండా కొత్త జిల్లాలకు తగ్గట్టు కొత్త నెంబర్లు దసరా నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక ఒకసారి వాహనాల నెంబర్లు మార్చుకోవలసి వచ్చింది. తిరిగి రెండేళ్లు కాకుండానే వాహన యజమానులు కొత్త నెంబర్ పేట్లు రాయించుకోవలసిన పరిస్థితి ఏర్పడబోతోంది.

Wednesday, 24 August 2016

చిలుకూరు బాలాజీ గురించి కొన్ని షాకింగ్ విషయాలు..

తిరుమల దేవ దేవుని తరువాత హైదరాబాద్‌ వాసులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దైవం చిలుకూరు బాలాజీ. హైదరాబాద్‌ శివారులో ఉండే ఈ దేవాలయం ప్రతి రోజు కూడా భక్తులతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా శని, ఆదివారాల్లో భక్తుల రద్ది విపరీతంగా ఉంటుంది. భక్తులకు కొంగు బంగారంగా పేరు తెచ్చుకున్న చిలుకూరు బాలాజీ దేవాలయం.. మిగిలిన దేవాలయాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పద్దతులు మరియు అయ్యవార్ల పని తీరు వైవిధ్యంగా ఉంటుంది.
500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలోకి 'అందరు సమానమే' అన్న రీతిలో దేవుడిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్లుగా వీఐపీ దర్శనం, టికెట్‌ దర్వనం, ఫ్రీ దర్శనం అంటూ ఉండదు. పీఎం, సీఎం, సాదారణ జనాలు అంతా కూడా ఒకే మాదిరి దర్శనం చేసుకోవాలి.
ఇక ప్రస్తుతం ఏ దేవాలయాల్లో చూసినా కూడా హుండీ ఉంటుంది. కాని ఈ దేవాలయంలో మాత్రం హుండీ కనిపించదు. అలానే భక్తుల నుండి కానుకలు తీసుకోవడం ఉండదు.
ఇతర గుడుల్లో పూజలు, హారతులు ఇచ్చే సమయంలో అయ్యగార్లకు అంతో ఇంతో ఇవ్వాల్సి ఉంటుంది. కాని చిలుకూరు లో మాత్రం అయ్యవార్లకు ఇవ్వనవసరం లేదు.  
చిలుకూరు బాలాజీని వీసాల స్వామీ అనే పేరు ఉంది. విదేశాలకు వెళ్లాలని కోరుకునే వారు స్వామివారిని కోరుకుంటే వారికి వెంటనే వీసా వస్తుందని భక్తుల నమ్మకం.
ఇతర దేవాలయాల్లో కొబ్బరి కాయ కొట్టేందుకు, అర్చనకు, దర్శనంకు ఇలా అన్నింటికి టికెట్లు ఉంటాయి. కాని ఈ దేవాలయంలో మాత్రం వేటికి టికెట్లు ఉండవు.
ఈ దేవాలయంలో ఏదైనా కోరిక కోరుకుని 11 ప్రదక్షిణలు చేస్తారు. అది నెరవేరితే 108 ప్రదక్షణలు చేసి మొక్కును చెల్లించుకుంటారు. ఇప్పటికీ లక్షల మంది 108 ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు.
ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలో 350 సంవత్సరాల రావి చెట్టు ఉంది. దాన్ని తాకితే మంచి జరుగుతుందని నమ్మకం. ఒక్క హైదరాబాద్‌ నుండే కాకుండ అన్ని ప్రాంతాల నుండి భక్తులు చిలుకూరు బాలాజీ దర్శనంకు వస్తారు.
హైదరాబాద్‌ నుండి విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్‌ వచ్చిన సమయంలో బాలాజీని దర్శించుకోకుండా వెళ్లారంటే అతిశయోక్తి కాదు. టెంపుల్‌ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయమే గుడి నిర్వహణకు ఖర్చు చేస్తారు.

Friday, 19 August 2016

దేవతలే దిగివస్తే..

కృష్టమ్మ పుష్కరాలంటే ముక్కోటి దేవతలు.. ముగ్గురు మూర్తులు.. అందరికీ వేడుకే. అందుకే దీవెనలు అందించేందుకు ఆ దేవతలంతా తరలొచ్చి కృష్ణమ్మ చెంత కొలువుదీరారు. ఆ దివ్య జలాల్లో మూడు మునకలు వేసి తరించే భక్తకోటిని దీవించేందుకు శ్రీశైల మల్లికార్జునుడు, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ, బిక్కవోలు సుబ్రహ్మమణ్యేశ్వరుడు, శ్రీకూర్మం శ్రీకూర్మనాథేశ్వరుడు, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, రామతీర్థం రామనాధస్వామి, చిలకలపూడి శ్రీ పాండురంగస్వామి, కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమూనా ఆలయాలతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ దేవాలయాల ప్రాంగణం భక్తులను విశేషంగా అలరిస్తోంది.

మరోసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. సెప్టెంబరు 2వ తేదీన ఐదు లక్షల మంది బ్యాంకర్లు ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ) గురువారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు, కార్మిక వ్యతిరేక సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కన్వెన్షన్‌లో సమ్మెపై నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ తెలిపింది.
క్లీనింగ్‌ బ్యాలెన్స్‌ షీట్స్‌ పేరుతో పెద్ద మొత్తంలో బ్యాడ్‌ లోన్స్‌ని ప్రజల దృష్టిలోకి రాకుండా చేస్తున్నారని, ఏటా సగటున 50వేల కోట్ల రుణాలను రైట్‌ ఆఫ్‌ చేస్తున్నారని జనరల్‌ సెక్రెటరీ సీహెచ్‌ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ, ప్రాంతీయ, గ్రామీణ, కోఆపరేటివ్‌ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నట్లు ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ వెంకటాచలం తెలిపారు.

బ్యాంకుల విలీనానికి ఎస్‌బీఐ పచ్చజెండా

దేశంలో మొదటిసారి భారీ స్థాయిలో బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమైంది. అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లోకి భారతీయ మహిళా బ్యాంకు సహా మొత్తం ఆరు బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇందుకు ఎస్‌బీఐ అంగీకారం తెలిపింది. దీంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, భారతీయ మహిళా బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనం కానున్నాయి.

హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన సైనా నెహ్వాల్

భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ ఆసుపత్రిలో చేరారు. రియో ఒలింపిక్స్ సందర్భంగా మోకాలికి గాయం కారణంగా ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కొనసాగుతోందని సైనా తండ్రి హర్వీందర్ సింగ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ముంబై ఆసుపత్రికి వెళ్తామని చెప్పారు. రియోలో ఉక్రెయిన్‌కు చెందిన మరియాతో తలపడుతుండగా సైనా మోకాలికి గాయమైంది.

ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా 106 వ్యాధులు చేర్చాం : చంద్రబాబు

      ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా 106 వ్యాధులు చేర్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అలాగే వైద్య ఆరోగ్య కేంద్రాలకు జవసత్వాలు తీసుకొస్తామన్నారు. కాగా... అమరావతిని టాప్‌టెన్‌ నగరాల్లో ఒకటిగా నిలబెడతామన్నారు. అలాగే పవిత్ర సంగమం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చంద్రబాబు పేర్కొన్నారు.

భారీగా పెరిగిన ముఖ్యమంత్రి వేతనం

లక్నో: ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి నోరు తీపి చేసుకుంటున్నారు. వారి వేతనలు ఏకబిగిన 40 శాతం పెరగడమే ఇందుకు కారణం. ఉత్తరప్రదేశ్ కేబినెట్ బుధవారం ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపు ప్రకారం వచ్చే నెల నుంచి సహాయ మంత్రులు రూ.25వేలు, ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు రూ.28వేలు అధికంగా అందుకోనున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు నెలకు రూ.12 వేలు వేతనంగా అందుకుంటుండగా సెప్టెంబరు నుంచి రూ.40వేలు, సహాయ మంత్రులు రూ.35 వేలు అందుకోనున్నారు.

17 నెలల గర్భిణి

బీజింగ్‌: అవును. మీరు చదవింది నిజమే! ఓ మహిళ 17 నెలలుగా గర్భంతో ఉన్నా ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వలేదు. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌కి చెందిన వాంగ్‌షీ అనే మహిళ 2015 ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. గతేడాది నవంబర్‌లో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. తొమ్మిది నెలలు నిండాక పురుడు కోసం భర్త కాంగ్‌తో కలిసి ఆస్పత్రికి వెళ్లింది.
అక్కడి వైద్యులు ఇంకా కడుపులో బిడ్డ పూర్తిగా ఎదగలేదని చెప్పారు. కేవలం వైద్య పరీక్షలకే 1,156 పౌండ్లు ఖర్చవుతోందని ఇప్పటికి 17 నెలలు కావొస్తున్నా ఇంకా పిల్లలు పుట్టలేదని వాంగ్‌షీ తెలిపింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు 25.2 కిలోల బరువు పెరిగానని కానీ దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని పేర్కొంది. ఇక ఈ బరువు తాను మోయలేనని సిజేరియన్‌ చేయండని వైద్యులను ఎంత అడిగినా వారు అందుకు ఒప్పుకోలేదట. వైద్యపరమైన కారణాల వల్లే కడుపులో బిడ్డ ఎదగడంలేదని ఇలాంటి కేసులు ప్రతి 200 మందిలో ఒకరికి కన్పిస్తుంటాయని వైద్యులు తెలిపారు.

Monday, 15 August 2016

భారత్ పతకం సాధించే రోజు..!



రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో ఇప్పటికి 9 రోజులు పూర్తయ్యాయి. 10వ రోజు ఆటలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ భారత్ ఖాతా తెరవలేదు. మెడల్స్ వస్తాయనుకున్న కొందరు క్రీడాకారులు నిరాశపరిచారు. అభినవ్ బింద్రా, దీపా కర్మాకర్, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖులు పోటీ నుంచి నిష్క్రమించారు. దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశం కోల్పోయినప్పటికీ భారత ప్రజల మనసును మాత్రం గెలిచింది. అయితే పదో రోజు ఆటలో భారత్‌కు పతకం వచ్చే అవాకాశం కనబడుతోంది. సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తనకొద్దని భారత్‌కు గోల్డ్ మెడల్‌తోనే వస్తానని చెప్పిన భారత బాక్సర్ వికాశ్ కృష్ణన్ క్వార్టర్స్ ఫైనల్స్‌లో తలపడనున్నాడు. ఉజ్బెకిస్థాన్ ఆటగాడితో ఢీ కొట్టనున్నాడు. ఈ మ్యాచ్‌లో గనక వికాశ్ గెలిస్తే భారత్‌కు ఒక పతకం కచ్చితంగా వచ్చే అవకాశముంది.
 మరోపక్క పీవీ సింధూ, కాదంబి శ్రీకాంత్ వాళ్ల మ్యాచ్‌లో గెలిచి రౌండ్ 16కి క్వాలిఫై అయ్యారు. భారత ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి కూడా ఫైనల్స్‌కు చేరుకునేందుకు ఈ రోజు పోటీలో నిలవనున్నాడు. అయితే ఈరోజు వికాశ్ కృష్ణన్ రూపంలో భారత్‌కు పతకం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.