శాన్‌ఫ్రాన్సిస్కో: సముద్ర గర్భంలో అన్వేషిస్తున్న కొందరు సాహస
యాత్రికులకు రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి యుద్ధ నౌక ఒకటి కనిపించింది.
పసిఫిక్ మహాసముద్రంలోని కాలిఫోర్నియా తీరంలో ఈ యుద్ధనౌకను
కనుగొన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లను మోసుకెళ్లే ఇలాంటి యుద్ధనౌక సముద్ర
గర్భంలో కనిపించడం ఇదే తొలిసారి. యూఎస్ఎస్ ఇండిపెండెన్స్ అనే పేరు గల ఈ
నౌకను ప్రముఖ ఓషనోగ్రాఫర్ రాబర్ట్ బలార్డ్ ముందుగా చూశారు. గ్రేటర్
ఫారాలోన్స్ నేషనల్ మరైన్ సాంక్చురీలో కిలోమీటర్ లోతులో ఈ యుద్ధనౌకను
గుర్తించారు.
దీంతో సముద్ర పరిశోధన నౌక నాటిలస్‌లో ఉన్న శాస్త్రవేత్తలు సముద్ర గర్భానికి రెండు జలాంతర్గాములను పంపించారు. అవి అందించిన సమాచారం మేరకు ఆ యుద్ధనౌకలో ఓ హెల్‌కాట్ ఫైటర్ ప్లేన్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆ నౌకపై ఉన్న శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించనున్నారు. దీనివల్ల పర్యావరణ మార్పులు, అణుబాంబులను పరీక్షించడం వల్ల అందులో ఇంకా ఏమైనా రేడియో ధార్మికత ఉందా అన్న అంశాలు తెలుసుకునే వీలుంటుంది. ఈ యుద్ధనౌక శిథిలాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో మీరూ చూడండి.

No comments:
Post a Comment