లాస్‌ఏంజిల్స్:
అమెరికాలో జరిగిన ఓ రియాల్టీ
షోలో అపశృతి చోటుచేసుకుంది.
లైవ్‌లో అందరూ చూస్తుండగానే
స్టంట్ చేస్తుండగా పొరపాటుగా
నిప్పుల బాణం అవతలి వ్యక్తి
మెడలోకి దూసుకెళ్లింది. ఎన్‌బీసీ
ఛానల్‌లో ప్రసారమయ్యే ‘అమెరికాస్
గాట్ టాలెంట్’ షోలో మంగళవారం
ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ
బాణం తగిలిన వ్యక్తికి పెద్దగా
ప్రమాదం జరగలేదు. కత్తులను గొంతులోకి
దింపుకోగల నైపుణ్యం ఉన్న రేయాన్
స్టాక్ అనే వ్యక్తికి ఈ రియాల్టీ
షోలో బాణం తగలగా తర్వాత తాను
బాగానే ఉన్నానని ప్రమాదమేమీ
లేదని వెల్లడించారు.
రేయాన్ స్టాక్ సునాయాసంగా తన గొంతులోకి కత్తులు, పొడవాటి రాడ్లు దింపుకొని తిరిగి బయటకు తీస్తాడు. రియాల్టీ షోలోనూ అదే విధంగా స్టంట్స్ చేస్తుండగా.. మొదట ఓ కత్తిని, తర్వాత ఓ బాణాన్ని గొంతులోకి దించుకుని బయటకు తీశాడు. ఆ తర్వాత టేబుల్ ల్యాంప్‌కు పైన ఉన్న ల్యాంప్ తీసేసి కింద స్టాండ్‌ను తన గొంతులోకి దింపుకున్నాడు. స్టాండ్ వెనుక భాగాన్ని బాణం వేసే టార్గెట్‌గా పెట్టారు. అతడితో పాటు ఉన్న ఓ అమ్మాయి మంటలతో ఉన్న బాణాన్ని టార్గెట్ వైపునకు వేసింది. కానీ అది టార్గెట్‌ను కాకుండా రేయాన్ మెడకు తగిలింది. దీంతో రియాల్టీ షోలో జడ్జిలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెకానికల్ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని రేయాన్ వెల్లడించారు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డానని తర్వాత రేయాన్ ట్వీట్ చేశారు.

No comments:
Post a Comment