ప్రో కబడ్డీ సీజన్-4 విజేత పట్నా
డిఫెండింగ్ ఛాంపియన్ పట్నా
పైరేట్స్ ప్రో కబడ్డీ నాలుగో
సీజన్ టైటిల్‌ను గెలుచుకుంది.
జైపూర్ పింక్‌ఫాంథర్స్‌తో
హైదరాబాద్ గచ్చిబౌలీలోని
ఇండోర్ స్టేడియంలో జరిగిన
ఫైనల్ మ్యాచ్‌లో 37-29 పాయింట్ల
తేడాతో ఘనవిజయం సాధించింది.
తొలి అర్ధభాగంలో 19-16 పాయింట్ల
స్వల్ప తేడాతో మ్యాచ్ నువ్వానేనా
అన్నట్లు సాగింది. అయితే రెండో
అర్ధభాగంలో జైపూర్ జట్టులో
డిఫెండర్స్ వైఫల్యాన్ని
సొమ్ముచేసుకుంటూ పట్నా రైడర్స్
పాయింట్లు సాధించారు. పట్నాపైరేట్స్
జట్టు కీలక ఆటగాడు ప్రదీప్
నర్వాల్ 16 రైడింగ్స్ పాయింట్లు
సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో
మొత్తం 115 పాయింట్లతో ద్వితీయ
స్థానంలో నిలిచాడు. తెలుగుటైటాన్స్
ఆటగాడు రాహుల్ చౌదరి అగ్రస్థానంలో
ఉన్నాడు. మ్యాచ్ తిలకించేందుకు
తెలుగు రాష్ట్రాల గవర్నర్
నరసింహన్, బాలీవుడ్ కథానాయకుడు
హృతిక్ రోషన్, నటి పూజాహెగ్డే
తదితరలు హాజరయ్యారు.
No comments:
Post a Comment