రియో డి
జనీరో: అగ్రశ్రేణి షూటర్ అభినవ్
బింద్రా భారత పతక ఆశలను పదిలం
చేశాడు. 10మీ.ఎయిర్ రైఫిల్ పురుషుల
అర్హత పోటీల్లో ఏడో స్థానంలో
నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఆరు సిరీస్‌లలో 104.3, 104.4, 105.9, 103.8, 102.1,
105.2తో మొత్తం 625.7 స్కోరుతో ఫైనల్
పోరులో నిలిచాడు. ఇటలీ షూటర్
కాంప్రియాని నికోలో 630.2 స్కోరుతో
తొలి స్థానంలో నిలిచాడు. సిరీస్‌లు
ముగుస్తున్నా కొద్దీ బింద్రా
తక్కువ ర్యాంకుకు వెళ్తుండటంతో
భారత శిబిరంలో ఆందోళన ఆవహించింది.
ఆఖరి సిరీస్‌లో 105.2 స్కోరు సాధించడంతో
ఫైనల్‌కు చేరుకున్నాడు.
గగన్ విఫలం
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో షూటర్ గగన్ నారంగ్ ఫైనల్ చేరుకోవడంలో విఫలమయ్యాడు. 621.7 స్కోరుతో 23వ స్థానంలో నిలిచాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్ చేరుకుంటారు.
గగన్ విఫలం
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో షూటర్ గగన్ నారంగ్ ఫైనల్ చేరుకోవడంలో విఫలమయ్యాడు. 621.7 స్కోరుతో 23వ స్థానంలో నిలిచాడు. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్ చేరుకుంటారు.

No comments:
Post a Comment