ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ
స్నేహితులకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టడమన్నది సాధారణమైపోయింది. అయితే ఈ
ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లకు పెద్ద చరిత్రే ఉంది. క్రీ.పూ 481లోనే ఇవి చైనాలో
రంగప్రవేశం చేశాయని, 13వ శతాబ్దంలో అరేబియన్లు దారంతో పలురకాలుగా ముడులు
వేసి వీటిని తీర్చిదిద్దేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఒకప్పుడు
సముద్రంలోకి వెళ్లే నావికులు వివిధ రకాలుగా ముడులు వేసి ఈ బ్యాండ్‌లను
అల్లుతూ తమ స్నేహితులకు ఇచ్చేవారట. ఆ తర్వాతి కాలంలో ఇటలీ, ఫ్రాన్స,
బ్రిటన, అమెరికా దేశాల్లో ఈ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు జనాదరణ పొందాయి.
ఇందులో కట్టే ఒక్కోరకం రంగు దారం ఒక్కో భావానికి ప్రతీకగా నిలుస్తాయట.

No comments:
Post a Comment