Monday, 1 August 2016

లీకేజీ రాష్ట్రానికి మైనస్సే!


  • అయినా ఇబ్బంది లేదు.. దోషులను పట్టాం 
  • ఇక జాగ్రత్తగా ఉండేందుకు దోహదం 
  • సమీక్షలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు 
  • లీకు ర్యాంకర్లకు ఎంసెట్‌-3లో నో చాన్స్! 
  • మంత్రులను బర్తరఫ్‌ చేయాలి 
  • గళమెత్తిన విద్యార్థి సంఘాలు 
  • రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు 
  • నల్లగొండలో పిల్లలపై లాఠీచార్జి 
  • లీకేజీలో కేటీఆర్‌ హస్తం: షబ్బీర్‌ 
         ఎంసెట్‌-2 లీకేజీ ఘటన రాష్ట్రానికి మైనస్సేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయినా ఇబ్బంది లేదని, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పేపర్‌ లీక్‌ ఘటనపై ధైర్యంగా స్పందించామని, ఎలాంటి సంకోచం లేకుండా సీఐడీ విచారణకు ఆదేశించామని చెప్పారు. లీక్‌కు బాధ్యులైన వారిని పట్టుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవని అన్నట్లు తెలిసింది. ఈ ఘటన మంచికే జరిగిందని కూడా సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. భవిష్యతలో జాగ్రత్తగా ఉండేందుకు ఈ ఘటన తోడ్పడుతుందని, ఇకపై ప్రతి సెట్‌ నిర్వహణ, పోటీ పరీక్ష నిర్వహణలోనూ జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

No comments:

Post a Comment