రియో డీ జనీరో:
రియో ఒలింపిక్స్‌లో ఇప్పటికి 9 రోజులు పూర్తయ్యాయి. 10వ రోజు ఆటలు
కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ భారత్ ఖాతా తెరవలేదు. మెడల్స్
వస్తాయనుకున్న కొందరు క్రీడాకారులు నిరాశపరిచారు. అభినవ్ బింద్రా, దీపా
కర్మాకర్, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖులు పోటీ నుంచి నిష్క్రమించారు. దీపా
కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశం
కోల్పోయినప్పటికీ భారత ప్రజల మనసును మాత్రం గెలిచింది. అయితే పదో రోజు ఆటలో
భారత్‌కు పతకం వచ్చే అవాకాశం కనబడుతోంది. సిల్వర్, బ్రాంజ్ మెడల్స్
తనకొద్దని భారత్‌కు గోల్డ్ మెడల్‌తోనే వస్తానని చెప్పిన భారత బాక్సర్
వికాశ్ కృష్ణన్ క్వార్టర్స్ ఫైనల్స్‌లో తలపడనున్నాడు. ఉజ్బెకిస్థాన్
ఆటగాడితో ఢీ కొట్టనున్నాడు. ఈ మ్యాచ్‌లో గనక వికాశ్ గెలిస్తే భారత్‌కు ఒక
పతకం కచ్చితంగా వచ్చే అవకాశముంది.
మరోపక్క
పీవీ సింధూ, కాదంబి శ్రీకాంత్ వాళ్ల మ్యాచ్‌లో గెలిచి రౌండ్ 16కి క్వాలిఫై
అయ్యారు. భారత ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి కూడా ఫైనల్స్‌కు
చేరుకునేందుకు ఈ రోజు పోటీలో నిలవనున్నాడు. అయితే ఈరోజు వికాశ్ కృష్ణన్
రూపంలో భారత్‌కు పతకం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.


No comments:
Post a Comment