మాంచెస్టర్:
దేశమేదైనా మహిళల పరిస్థితి దయనీయమేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. ప్రపంచంలో
ఏమూల దాక్కున్నా మృగాళ్లు మహిళలను వదిలిపెట్టరన్న విషయం ఈ క్రూరత్వంతో
తేటతెల్లమైంది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన లూయిస్(పేరుమార్చాం)పై
కీత్ డౌనెండ్(61) అనే కామాంధుడు ఏకంగా 3 వేల సార్లు అత్యాచారానికి
పాల్పడ్డాడు. లూయీస్‌కు పదేళ్ల వయసున్నప్పటి నుంచి కామాంధుడి దృష్టి ఆమెపై
పడింది. ఆమెకు 16 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏకంగా 2,987 సార్లు అఘాయిత్యానికి
పాల్పడ్డాడు. లూయీస్‌ను బెదిరించడంతో ఆమె తాను అనుభవిస్తున్న నరకాన్ని
ఎవరికీ చెప్పుకోలేకపోయింది. అయితే 2012లో ఇటువంటి ఘటనలే వరుసగా
చోటుచేసుకోవడం, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో లూయీస్ కూడా ధైర్యాన్ని
కూడగట్టుకుంది. పోలీసులను కలిసి తనలో రగులుతున్న బడబాగ్నిని
వారిముందుంచింది. కేసు కోర్టుకెక్కింది. కీత్‌ను దోషిగా తేల్చిన కోర్టు 19
ఏళ్ల జైలు శిక్ష విధించింది.
మాంచెస్టర్‌లోని
తమ ఇంటి సమీపంలోనే కీత్ కుటుంబం ఉండేదని పేర్కొన్న లూయీస్(48).. కీత్ తనకు
ఎలా నరకం చూపించిందీ వివరించింది. రోజూ రెండుసార్లు తనపై అత్యాచారానికి
పాల్పడేవాడని పేర్కొంది. తన బాల్యాన్ని దోచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
డబ్బుల అవసరం కోసం తన తండ్రి కీత్ వద్దకు పంపిన ప్రతిసారీ తనపై కీత్
అఘాయిత్యానికి పాల్పడేవాడని కన్నీరు సుడులు తిరుగుతుండగా చెప్పింది.
ప్రస్తుతం లూయీస్ నాటింగ్‌హామ్‌లో చెఫ్‌గా పనిచేస్తోంది.

No comments:
Post a Comment