ఏ చెల్లికి ఇలాంటి అన్నయ్య ఉండకూడదు...
మొబైల్‌లో అశ్లీల చిత్రం వీక్షించిన అన్నను మందలించిన పాపానికి వరుసకు చెల్లి అయిన యువతి దారుణ హత్యకు గురైంది. తమిళనాడులోని కోవై జిల్లా మేట్టుపాళెయంలో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళెయం చెందిన ఫక్రిస్వామి అనే వ్యక్తి కుమార్తె జయశ్రీ (16) గత 22వ తేదీ రాత్రి బయటకు వెళ్ళి ఇంటికి రాలేదు. కంగారు పడ్డ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించడంతో భయానికి గురైన హతుడు దినేష్ కుమార్. జయశ్రీని చంపింది నేనే అని తేక్కపట్టి పంచాయతీ కౌన్సిలర్ అమీదా వద్దకు వెళ్ళి తెలపడంతో డొంక కదిలింది. జరిగిన సంఘటనను అమిదా పోలీసులకు తెలపడంతో దినేష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతికి అన్నయ్య వరస అయ్యే దినేష్ కుమార్ అరటి గెలలు కోసే కూలీగా పని చేస్తున్నాడు జయశ్రీని హత్య చేసి అరటి తోపులో పాతిపెట్టినట్టు తెలిపాడు. ఈనెల 22వ తేదీన అరటితోపులో తన మొబైల్‌లో అశ్లీల చిత్రం చూస్తుండగా, బహిర్భూమికి వచ్చిన జయశ్రీ అమ్మానాన్నలకు చెపుతానని బెదిరించిందని, అందుకే ఆమెను రేప్ చేసి హత్య చేశానని తెలిపాడు. శవాన్ని కూడా అరటి తోటలోనే పాతిపెట్టినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

No comments:
Post a Comment