Monday, 15 August 2016

క‌న్న తండ్రిని చంపిన కూతురు (వీడియో)...

ఆమె ఓ డాక్టర్.. ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాల్సిన ప‌విత్ర‌మైన వృత్తిలో ఆమె కొన‌సాగుతోంది. త‌న సేవ‌తో ఎంతోమంది మ‌న‌స్సుల‌ను, హృద‌యాల‌ను ఆమె గెలుచుకోవాలి. అయితే ఆమె త‌న ప‌విత్ర‌మైన వృత్తికే మ‌చ్చ తెచ్చేలా ఓ దుర్మార్గ‌మైన ప‌ని చేసింది. 82 ఏళ్ల వ‌య‌స్సులో ఆసుప‌త్రిలో క‌ద‌ల‌లేని స్థితిలో….ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడి ప్రాణాలను త‌న వైద్య ప‌రిజ్ఞానంతో చాలా తెలివిగా చంపేసింది. అంత వృద్ధుడిని చంపాల్సిన అవ‌స‌రం ఆమెకు ఎందుకు వ‌చ్చింద‌నుకుంటున్నారా.. ఆస్తి కోసం…ఇంత‌కు ఆమె చంపిన ఆ వృద్ధుడు ఎవ‌రో కాదు..ఆమె స్వ‌య‌నా జ‌న్మ‌నిచ్చిన తండ్రే. అత‌డు కూడా మాజీ వైద్యుడే కావ‌డం మ‌రో ట్విస్ట్‌.
ఈ సంఘ‌ట‌న జ‌రిగిన రెండు నెల‌ల‌కు కాని ఆమె చేసిన ఈ దుర్మార్గం ప్ర‌పంచానికి తెలియ‌లేదు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. చెన్నైకు చెందిన‌ జయసుధ అనే ఆ మహిళా డాక్టర్ ఆస్తికోసం ఇంతగా తెగించింది. ఆస్తులకు సంబంధించిన కాగితాలపై బలవంతంగా సంతకాలు, వేలిముద్రలు తీసుకుని.. ఇంట్రావీనస్ డ్రిప్ ఇంజెక్టింగ్ మెడిసిన్లు అందకుండా చేసింది. దీంతో వృద్ధుడైన ఆమె తండ్రి చ‌నిపోయాడు. దీనిని ముందు అంద‌రూ స‌హ‌జ‌మ‌ర‌ణంగానే భావించారు.
అయితే ఆ వృద్ధుడు చ‌నిపోయాక రెండు నెల‌ల‌కు హాస్పిటల్‌లోని సీసీటీవీ ఫుటేజీల ద్వారా అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ దృశ్యాలను చూసిన తర్వాత డాక్టర్ ఆర్ జయప్రకాశ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన సోదరి అయిన డాక్టర్ జయసుధపై హత్యాయత్నం, బెదిరింపు అభియోగాలపై కేసు నమోదు చేశారు. జయసుధ ఒకరోజు తన ఇద్దరు కొడుకులతో తండ్రిని చూసేందుకు వ‌చ్చింది.
ఆమె తండ్రి ప‌క్క‌నే ఉన్న ముగ్గురు న‌ర్సుల‌ను బ‌య‌ట‌కు పంపిది. ఆమె కొడుకు తన షర్టు కింద నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీసివ్వగా ఆమె తన తండ్రితో బలవంతంగా సంతకం చేయించుకుంది. అలాగే వేలిముద్రలు కూడా తీసుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. ఆ తర్వాత ఐవీ లైన్ల నుంచి ప్రాణాధార మందులందకుండా ట్యూబులను మూసేసింది. ఈ ఉదంతంపై ఆమె సోదరుడు పోలీసులతోపాటు భారత వైద్య మండలికి కూడా ఫిర్యాదు చేశారు.

No comments:

Post a Comment