తెలంగాణ ప్రభుత్వానికి
హైకోర్టులో చుక్కెదురయింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.123, 124ను
హైకోర్టు కొట్టేసింది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలుకు ప్రభుత్వం జీవో
తెచ్చింది. ఈ జీవోకి వ్యతిరేకంగా జహీరాబాద్ వ్యవసాయ కూలీలు హైకోర్టులో
పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు వెలువరించిన హైకోర్టు, రైతులతోపాటు
కూలీలకు పరిహారం ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.

No comments:
Post a Comment