కొందరికి వ్యాయామం
చేయడమంటే ఇష్టం. మరికొందరు అస్సలు దాని జోలికే పోరు. అయితే వ్యాయామం పట్ల
ఇష్టం లేకపోవడం వారి తప్పు కాదనీ, ఆ ఇష్టం పుట్టుకతోనే అంటే తల్లి గర్భంలో
ఉండగానే ఏర్పడుతుందనీ అంటు న్నారు అమెరికా పరిశోధకులు. టెక్సాస్ పిల్లల
ఆసుపత్రి వైద్యులు ఈ విషయంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఎలుకల మీద చేసిన
పరిశోధన ద్వారా వారు పై విషయాన్ని నిర్ధారించారు. గర్భంతో ఉన్న కొన్ని
ఎలుకలను ఉత్సాహంగా తిరగనిచ్చారు. మరికొన్ని ఎలుకలను కట్టడి చేసి ఉత్సాహంగా
తిరగకుండా చూశారు. అవి ప్రసవించిన తరువాత పిల్ల ఎలుకల ప్రవర్తన
పరిశీలించారు. ఉత్సాహంగా అటూ ఇటూ పరిగెట్టిన ఎలుకల పిల్లలు కూడా అంతే
ఉత్సాహంగా ప్రవర్తిస్తుండగా, ఉత్సాహంగా తిరగని ఎలుకల పిల్లలు స్తబ్దుగా
ఉండడం వీరు గమనించారు. గర్భవతిగా ఉన్న మహిళలు ఎప్పుడూ కూర్చోకుండా అటూ ఇటూ
ఉత్సాహంగా తిరిగితే పుట్టే పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా ఉంటారని వీరు
అంటున్నారు. దీని మీద ఇంకా విస్తృతంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

No comments:
Post a Comment