Friday, 5 August 2016

ఆధార్‌ అనుసంధానానికి అధికారుల పరుగు

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పక్కా ప్రణాళికతో విద్యాశాఖ వేగం పెం చింది. మండలాల వారీగా విద్యాశాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశాలు పెట్టడం, ప్రతి మండల బృందంతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేయడం, డీవైఈవోలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ అధి కారులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఐఎస్‌, సీఆర్‌ పీలు, డీఎల్‌ఎంటీలతో స్థాయిల వారీగా రివ్యూ మీటింగ్‌లు పెట్టడం వంటి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నారు. 2015-16 విద్యా సంవత్సరం ప్రారంభమైనది మొదలు 10 నెలల సమయంలో పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయడం కనీసం 50 శాతం కూడా పూర్తి చేకపోవడంతో ఇప్పుడు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ బడుల విషయంలో కేవలం 45 శాతం విద్యార్థుల వివరాలు సేకరించగ లిగారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలు కాకుండానే దాదాపు అన్ని పాఠశాలల్లో కలిపి ప్రస్తుతం 64.5 శాతానికి చేరుకోగలిగారు.

పాత బస్తీపై ప్రత్యేక దృష్టి

జిల్లా సగటు అనుసంధానం కన్నా తక్కువగా ఉన్న మండలాలు పరిశీలిస్తే 90 శాతం పాతబస్తీ ప్రాంతాలే ఉన్నాయి. బహదూర్‌పుర మండలం కేవలం 30 శాతమే పూర్తి చేయగలిగింది. గోల్కొండ 33, తిరుమలగిరి 37, బండ్లగూడ 38, ముషీరాబాద్‌ 38, ఆసిఫ్‌నగర్‌ 40, షేక్‌పేట్‌ 41, ఖైరతాబాద్‌ 42 శాతమే పూర్తి చేశారు. జిల్లాలో బాగా తక్కువ పాతబస్తీలోనే ఉండ టంతో ఆ ప్రాంతంపై దృష్టిసారించారు. మండలాల వారీగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిచనున్నారు. యంతారంగం కదలి కతో దాదాపు 50 శాతానికి తీసుకు రాగలిగారు.

ఆదర్శంగా సైదాబాద్‌ మండలం

విద్యార్థుల ఆధార్‌ అనుసంధానంలో సైదాబాద్‌ మండలం 75.9 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత హిమాయతనగర్‌ 74, ముషీరాబాద్‌ 71.6, సికింద్రాబాద్‌ 70.8, తిరుమలగిరి 68.4, నాంపల్లి 68, అంబర్‌పేట 67.7, అమీర్‌పేట 65.7, ఆసిఫ్‌నగర్‌ 65.2 శాతాలతో ముందున్నాయి.

సాంకేతిక సమస్యలతో కొంత జాప్యం

అధికారులు వేగం పెంచినా సాంకేతిక సమ స్యల కారణంగా కొంత ఆల స్యం జరుగుతుంది. ఆధార్‌ ఎంటర్‌ చేసినా తీసుకోక పోవడం.. మూసే సిన పాఠశాలల వివరాలు కూడా అడగడం.. వంటి సమస్యలతో ఇ బ్బంది పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవైపు అనుసం ధానం కోసం ప్రైవేటు విద్యా సంస్థ లపై ఒత్తిడి తేవడం వల్లే త్వరగా సాధ్యమైందని.. మరో వైపు వారి నుంచి సాంకేతిక సమస్యలపై ఫిర్యా దులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.

రెండు చోట్ల ఉండేవారి లెక్క తేలనుంది

అనుసంధానం చేసిన కొన్ని చోట్ల వాల్యూషన్‌ కాకుండా మిగిలిపోతున్నాయి. మొత్తం విద్యార్థుల్లో 4,01,669 మందికి ఆధార్‌ నంబరు ఇవ్వగా 3,92,230 మందికి మాత్రమే వాల్యూషన్‌ జరిగింది. 9,439 మంది విద్యార్థులు వివరాలు మాత్రం చెల్లుబాటు కావడం లేదు. ఒకే విద్యార్థి పేరు ఇటు ప్రైవేటు బడిలోనూ అటు సర్కారీ బడిలోనూ ఉంటుంది. దాని వల్ల రెండో సారి ఆధార్‌ తీసుకోవ డం లేదని నిపుణులు అంటున్నారు. మొత్తం ఈ ఆఽనుసం ధాన ప్రక్రియ పూర్తయితే అసలు విద్యా ర్థులు ఉన్నారా లేదా.. ప్రైవేటు వారి పేర్లు ఇక్కడ పెడుతున్నారా లేదా ఊహకి వచ్చిన పేర్తు రిజిస ్టర్లలో ఎక్కిస్తున్నారా అనేది తేలుతుంది.

No comments:

Post a Comment