బీజింగ్: అవును. మీరు
చదవింది నిజమే! ఓ మహిళ 17 నెలలుగా గర్భంతో ఉన్నా ఇప్పటికీ బిడ్డకు
జన్మనివ్వలేదు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కి చెందిన వాంగ్‌షీ అనే మహిళ
2015 ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. గతేడాది నవంబర్‌లో బిడ్డకు జన్మనివ్వాల్సి
ఉంది. తొమ్మిది నెలలు నిండాక పురుడు కోసం భర్త కాంగ్‌తో కలిసి ఆస్పత్రికి
వెళ్లింది.
అక్కడి వైద్యులు ఇంకా కడుపులో బిడ్డ పూర్తిగా ఎదగలేదని చెప్పారు. కేవలం వైద్య పరీక్షలకే 1,156 పౌండ్లు ఖర్చవుతోందని ఇప్పటికి 17 నెలలు కావొస్తున్నా ఇంకా పిల్లలు పుట్టలేదని వాంగ్‌షీ తెలిపింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు 25.2 కిలోల బరువు పెరిగానని కానీ దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని పేర్కొంది. ఇక ఈ బరువు తాను మోయలేనని సిజేరియన్ చేయండని వైద్యులను ఎంత అడిగినా వారు అందుకు ఒప్పుకోలేదట. వైద్యపరమైన కారణాల వల్లే కడుపులో బిడ్డ ఎదగడంలేదని ఇలాంటి కేసులు ప్రతి 200 మందిలో ఒకరికి కన్పిస్తుంటాయని వైద్యులు తెలిపారు.

No comments:
Post a Comment