గచ్చిబౌలిని
వూపేసిన ఉత్కంఠ
ఫైర్‌బర్డ్స్‌పై అద్భుత విజయం
ఆఖరి నిమిషంలో మాయ చేసిన తేజస్విని
అమ్మాయిలు అదరగొట్టారు. అభిమానులను
ఉత్కంఠతో వూపేశారు. గచ్చిబౌలి
వేదికగా స్టార్మ్ క్వీన్స్,
ఫైర్‌బర్డ్స్ మధ్య జరిగిన
మహిళల ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో
విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది.
22-23తో వెనకబడివున్న సమయంలో స్టార్మ్‌క్వీన్స్
రైడర్ తేజస్విని మాయ చేసి ఒక
బోనస్, టచ్ పాయింట్ సాధించి
తన జట్టును తొలి విజేతగా నిలిపింది.
తొలి అర్ధభాగంలో ఫైర్‌బర్డ్స్
మంచి వూపు మీద కనిపించారు. 10-8తో
ముందంజలో నిలిచారు. అయితే రెండో
అర్ధభాగంలో స్టార్మ్‌క్వీన్
దుమ్ము దులిపేశారు. వరుస పాయింట్లు
సాధించి 21-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
ఆట ముగిసేందుకు మరో రెండు నిమిషాలు
ఉందనగా ఫైర్‌బర్డ్స్ రైడర్లు
రాణించి ప్రత్యర్థి జట్టును
ఆల్‌ఔట్ చేసి స్కోర్‌ను 23-22కు
తీసుకొచ్చి పోటీలో నిలిచారు.
కాగా ఆట ముగిసేందుకు ఆఖరి ఐదు
సెకన్లు ఉందనగా తేజస్విని రెండు
పాయింట్లు సాధించి స్టార్మ్‌క్వీన్స్‌ను
24-23తో విజయ తీరాలకు చేర్చింది.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్
సతీమణి విమలా నరసింహన్ ట్రోఫీ
అందించారు.
ఫైర్‌బర్డ్స్‌పై అద్భుత విజయం
ఆఖరి నిమిషంలో మాయ చేసిన తేజస్విని



No comments:
Post a Comment