Monday, 15 August 2016

ఎక్కువగా మద్యం సేవించేది బ్యాచిలర్సా ? పెళ్లయినవాళ్లా ?

వర్జీనియా : ‘ఒంటరినైపోయాను...’ అని ఆవేదన ఉన్నవాళ్ళే మధుపానాన్ని ఆశ్రయిస్తారా? ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ...’ అన్నట్లుగా ఓ తోడు ఉన్నవాళ్ళు దాని జోలికి తక్కువగా వెళ్తారా? వర్జీనియా విశ్వవిద్యాలయం దీనిపైనే అధ్యయనం చేసింది. ఆ వివరాలేమిటో చూద్దామా?
 
పెళ్ళయినవాళ్ళు, సహజీవనం చేస్తున్నవాళ్ళు మద్యపానాన్ని తక్కువగా సేవిస్తారని ఈ అధ్యయనంలో తేలింది. సింగిల్ పర్సన్లయితే తరచూ, ఎక్కువ మొత్తంలో తాగడానికి మొగ్గు చూపుతారని వెల్లడైంది. అధ్యయనానికి నేతృత్వం వహించిన డయానా డైన్‌స్క్యూ మాట్లాడుతూ సన్నిహిత సంబంధాలు ఏర్పడితే ఆల్కహాలు వినియోగం తగ్గుతుందన్నారు. మరో వ్యక్తితో సంబంధాలు ఉన్నవారు, లేనివారు మద్యాన్ని సేవించే తీరును తాము అధ్యయనం చేసినట్లు తెలిపారు.
 
సింగిల్, డైవోర్స్‌డ్ పర్సన్ల కన్నా పెళ్ళయినవాళ్ళు తక్కువ మోతాదులో మద్యం సేవిస్తున్నట్లు గత అధ్యయనాలు వెల్లడించాయి. డైన్‌స్క్యూ నిర్వహించిన అధ్యయనంలో 2,425 మంది సజాతీయ జంటలను పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. వైవాహిక హోదా ప్రభావం ఏమిటి? తక్కువగా సేవించేవాళ్ళే పెళ్ళికి మొగ్గు చూపుతారా? అనే విషయాలను చెప్పలేమన్నారు.

No comments:

Post a Comment