Monday, 15 August 2016

ఫ్రీడం 251.. సూపరే సూపర్!

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ ఇస్తామని ప్రకటించి సంచలనాలకు తెరలేపిన రింగింగ్ బెల్స్ సంస్థ గుర్తుందిగా. రూ.251 అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ అంటూ ఫిబ్రవరిలో ప్రకటించి ఈ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలను గడగడలాడించింది. అయితే రూ.251 ఫోన్లపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది వేరే కథ. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ రింగింగ్ బెల్స్ ఇప్పటి వరకు 70వేల యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.
 
ఈ ఫోన్లను వాడుతున్న వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నదానికంటే ఈ ఫోన్ చాలా బాగా పనిచేస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని 1450 ఎంఏహెచ్ బ్యాటరీ పనితీరు సూపరంటున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు రెండు రోజులు వస్తుందంటున్నారు. మిగతా ఫోన్లలానే బ్లూటూత్, వైఫై బాగానే పనిచేస్తున్నాయని, ఇక 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉండడం మరింత ప్లస్ అవుతోందని చెబుతున్నారు. ప్రాగ్జిమిటీ సెన్సార్ దీనికి అదనపు ఆకర్షణ. ఫోన్ అన్‌లాకింగ్ కోసం ప్రతిసారీ పవర్ బటన్ ప్రెస్ చేయాల్సిన పనిలేదు. స్ర్కీన్ మీద వేలు పెడితే సరిపోతుంది. మామూలు ఫోన్లలో ఈ ఫోన్ వేడెక్కడం లేదని చెబుతున్న వినియోగదారులు కెమెరా పనితీరు కొంత అసంతృప్తిని కలిగిస్తోందని అంటున్నారు. అయితే రూ.251కి ఇటువంటి ఫోన్ రావడమే గొప్పని రివ్యూల్లో పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment