ఏటీఎం వివరాలు తెలిపితే..నగదు డ్రా
మీ ఏటీఎం వివరాలు ఎవరికీ చెప్పొద్దు. చెబితే ఈమె మోసపోయినట్లే మీరూ మోసపోవాల్సి వస్తుంది. ‘‘
మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది..తిరిగి దానిని పునరుద్ధరించాలంటే కొన్ని
వివరాలు తెలియజేయాలి..లేకుంటే కార్డు శాశ్వతంగా పనిచేయకుండా పోతుంది’’ అంటూ
ఓ మహిళకు ఫోన్ చేసి ఆమె చెప్పిన వివరాలతో ఏటీఎం నుంచి డబ్బులు కాజేశాడు
ఒకడు.. మోసపోయిన విషయం తెలుసుకున్న ఆమె లబోదిబోమంటూ బ్యాంకు సిబ్బందిని
సంప్రదించింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పట్టణానికి చెందిన కొంతం
రేవతికి ఎస్‌బీఐలో ఖాతా ఉంది. విదేశాల్లో ఉన్న కొడుకు పంపే డబ్బును ఈ
కార్డు ద్వారా డ్రా చేస్తూ ఉంటుంది. బుధవారం కాకినాడ సమీపంలోని తూరంగి
ఏటీఎం నుంచి రూ.500 డ్రా చేసింది. కొంత సమయం తర్వాత ఆమెకు ఓ ఫోన్
వచ్చింది. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని, ఆధార్ నెంబరు, కార్డు నంబరు
చెప్పాలని అడగడంతో వివరాలు తెలిపింది. కొంత సమయానికి రూ.5,000, రూ.9,500
డ్రా అయినట్లు ఫోన్‌కు సమాచారం వచ్చింది. దీంతో ఆమె వెంటనే స్టేట్‌బ్యాంకు
శాఖకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు అధికారులు ఆమె కార్డును బ్లాక్ చేశారు. ఈ
సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.
ఫోన్‌లో బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డులకు సంబంధించిన వివరాలు అడిగితే దయచేసి
చెప్పవద్దని వారు ఖాతాదారులను కోరారు.

No comments:
Post a Comment