ఏదైనా బ్యాంకు ఖాతాలో డబ్బు
జమ చేయాలంటే అదే బ్యాంకు లేదా
ఆ బ్యాంకుకు చెందిన ఏదైనాశాఖకు
వెళ్లి డబ్బులు జమ చేయాల్సి
ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు
తమ డిపాజిట్ మెషీన్ నుంచి
ఇతర బ్యాంకుల ఖాతాలకు డబ్బు
జమ చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.
ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్
ఆఫ్ ఇండియా, పంజాబ్, మహారాష్ట్ర
కో-ఆపరేటివ్ బ్యాంకులు ఈ జాబితాలో
ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)
నగదు పరస్పరమార్పిడి విధానాన్ని
అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏటీఎమ్‌లలో
ఎలాగైతే డబ్బులు విత్‌డ్రా
చేయగలమో అలాగే ఈ బ్యాంకుల నగదు
డిపాజిట్ మెషీన్ల నుంచి వేరే
బ్యాంకుల్లో ఉన్న ఖాతాలకు నగదును
డిపాజిట్‌లు చేయవచ్చట. ఇటీవల
కాలంలో ఆన్‌లైన్ వేదికగా నగదు
బదిలీ అవుతున్న నేపథ్యంలో ఆ
సౌకర్యం లేని వారు ఈ సదుపాయాన్ని
వినియోగించుకోవచ్చని ఎన్‌పీసీఐ
పేర్కొంది.

No comments:
Post a Comment