ముంబై : మద్యపానం
అనారోగ్యకరం. అలవాటైతే మానుకోవడం కష్టం. జనాన్ని ఆకర్షించడానికి కృత్రిమ
రుచులను, ప్రిజర్వేటివ్‌లను మద్యంలో కలుపుతూ ఉంటారు. అందువల్ల అనారోగ్యం
వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. ముంబై, పుణేల్లో ఉన్న ఆరు బీరు పరిశ్రమలు
చాలా శ్రమించి, కొత్త రకం బీరును తయారు చేస్తున్నాయి. వీటికి ఇంకా ప్రభుత్వ
అనుమతులు రాలేదని సమాచారం.
ఈ
కంపెనీలు తాము తయారు చేస్తున్న బీరుకు క్రాఫ్ట్‌బీరు అని పేరు పెట్టాయి.
దీన్ని తాగితే ఆరోగ్యానికి హాని ఉండదని చెప్తున్నాయి. మాల్ట్, హాప్స్ అనే
పువ్వులను, ఈస్ట్, నీరు ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నామని
పేర్కొన్నాయి. శుక్రవారం ప్రపంచ బీరు దినం సందర్భంగా క్రాఫ్ట్ బీరు వీకెండ్
పార్టీని ఏర్పాటు చేశాయి. మార్కెట్‌లో దొరికే బీరు కన్నా తాము తయారు చేసిన
బీరు ఆరోగ్యకరమని, ధర కూడా కొంచెం ఎక్కువేనని చెప్తున్నాయి.

No comments:
Post a Comment