Monday, 1 August 2016

అర్థరాత్రి కారును అడ్డుకుని... తల్లీకూతుళ్లపై అత్యాచారం !

నోయిడా: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో దారుణం జరిగింది. నోయిడా నుంచి షాజహాన్‌పూర్‌కు.. ఢిల్లీ-కాన్పూర్ హైవేపై కారులో వెళుతున్న కారును బందిపోటు దొంగలు ఇనుపరాడ్లతో దాడిచేసి అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు మహిళల్ని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన మిగిలిన ఇద్దరు కుటుంబసభ్యుల్ని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించారు. ఆరుగురు వ్యక్తులు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారి దగ్గరున్న డబ్బు, ఫోన్లు లూటీ చేశారు. అయితే ఈ ఘటన వెనుక వారి బంధువు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళల్లో 15 సంవత్సరాల బాలిక కూడా ఉండటం గమనార్హం. నోయిడాకు చెందిన ఈ కుటుంబం షాజహాన్‌పూర్‌లోని బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి 2.30 సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు ఐదుగురుని అనుమానితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment