ఉదయాన్నే
పోలీసుల సందడి కనిపిస్తే ఏవో తనిఖీలనుకున్నారు. ఒక్కసారిగా సాయుధ బలగాలు
తరలివస్తే ఏదో క్యాంప్‌కు వెళ్తున్నారనుకున్నారు. ఏం జరగబోతోందని
స్థానికులు చర్చించుకునే లోగానే.. ఎన్‌కౌంటర్ ముగిసింది. అతి తక్కువ
సమయంలోనే ఆపరేషన్ పూర్తయ్యింది.
హైదరాబాద్ శివార్లలో సంచలనం
ఉదయాన్నే కాల్పుల కలకలం
ఏం జరుగుతుందో తెలియని స్థితిలో జనం
మోస్ట్ వాంటెడ్ నయీముద్దీన్ హతం
ఒక్కసారిగా
హైదరాబాద్ శివార్లలో సంచలనం చోటు చేసుకుంది. ఉదయాన్నే ఓ టౌన్‌షిప్‌లో
వినిపించిన కాల్పులతో కలకలం చెలరేగింది. ఉన్నట్టుండి కాల్పుల మోతతో అసలేం
జరుగుతుందో తెలియని స్థితిలో జనం అయోమయంలో పడిపోయారు. కాసేపటికే వెల్లడైన
సమాచారంతో స్థానికులు వణికిపోయారు. పోలీసు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్
నయీముద్దీన్ హతమయ్యాడన్న వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో మీడియా
దృష్టి అంతా అటువైపు కేంద్రీకృతమైంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధి
షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మొత్తానికి
పదంటే పది నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయ్యింది.
పకడ్బందీగా సాగిన ఆపరేషన్
ఆదివారం రాత్రి 7 గంటలు
మూడో
కంటికి తెలియకుండా సాగిన ఈ ఆపరేషన్ మొదటినుంచీ.. పూర్తయ్యేవరకు అత్యంత
పకడ్బందీగా సాగింది. ఆదివారం రాత్రి ఏడుగంటలు... గ్యాంగ్‌స్టర్
నయీముద్దీన్ కదలికలపై పోలీసు వర్గాలకు సమాచారం అందింది.
పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నయీమ్ ఆనవాళ్లు
పక్కా స్కెచ్‌తో ఆపరేషన్‌కు ప్లాన్
ఎప్పటినుంచో
పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నయీమ్ ఆనవాళ్లు లభించడంతో ఈ అవకాశాన్ని
వదులుకోవద్దని పోలీసు అధికారులు నిర్థారణకు వచ్చారు. పక్కా స్కెచ్ వేశారు.
ఆపరేషన్‌కు ప్లాన్ చేశారు.
అత్యంత సీక్రెట్‌గా ఆపరేషన్ స్టార్ట్
రాత్రినుంచే నయీమ్ కదలికలపై డేగకన్ను
శాఖా
పరంగా అవసరమైన అనుమతులన్నీ లభించాక అత్యంత సీక్రెట్‌గా ఆపరేషన్ స్టార్ట్
అయ్యింది. తమకు వచ్చిన సమాచారం ఆధారంగా రాత్రి నుంచే నయీమ్ కదలికలపై
డేగకన్ను పడింది. తెల్లవారు జామునుంచే మలేషియా టౌన్‌షిప్ పరిసరాల్లో నిఘా
కొనసాగింది. అనుమానిత వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు. ఎటువైపు
వస్తున్నాడు.. ఏ వాహనంలో ప్రయాణిస్తున్నాడు... వంటి అంశాలను కూలంకషంగా
కనిపెట్టేశారు.
సోమవారం ఉదయం 7 గంటలు
నయీమ్‌గా నిర్థారణకు వచ్చిన నిఘా వర్గాలు
సోమవారం ఉదయం 7 గంటలు...
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్ పరిసరాలు...
టౌన్‌షిప్‌లోని
ఓ ఇంట్లో షెల్టర్ తీసుకున్న నయీం.. రాత్రి నుంచీ పలుసార్లు కారులో బయటకు
వెళ్లొచ్చాడు. అవన్నీ గమనించి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నది నయీమొద్దీన్ అని
నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.
సోమవారం ఉదయం 8 గంటలు
చుట్టుముట్టిన బలగాలు
ఏ క్షణాన్నైనా ఆపరేషన్‌కు సిద్ధం...
చివరి ఘడియల్లో గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్....
సోమవారం ఉదయం 8 గంటలు...
మలేషియన్ టౌన్‌షిప్‌ను బలగాలు చుట్టుముట్టాయి.
గ్రేహౌండ్స్,
ఎస్‌ఓటీ బృందాలు సమరానికి సన్నద్ధమయ్యాయి. అంతటా గంభీర వాతావరణం నెలకొంది.
ఏ క్షణాన్నైనా ఆపరేషన్‌కు సిద్ధమన్న సందేశాలు వెళ్లాయి. ఆపరేషన్‌లో
పాల్గొన్న వారికి తప్ప.. ఆ రహస్యం ఇంకెవరికీ తెలియదు. గ్యాంగ్‌స్టర్
నయీముద్దీన్ చివరి ఘడియల్లో ఉన్నాడు.
సోమవారం ఉదయం 8.30 గంటలు
ఏపీ 28 డీఆర్ 5859
కారులోనుంచి కాల్పులు
గ్రేహౌండ్స్, ఎస్‌ఓటీ బలగాల ఎదురు కాల్పులు
సమయం
రానే వచ్చింది. ఉదయం 8గంటల 30 నిమిషాలు. రాత్రినుంచీ రాకపోకలు సాగిస్తున్న
కారు ఆపరేషన్ టీమ్‌కు తారసపడింది. కారు నెంబర్ ఏపీ 28 డీఆర్ 5859.
ఒక్కసారిగా కారును చుట్టుముట్టిన బలగాలు కారులో వ్యక్తిని లొంగిపోవాలని
హెచ్చరించాయి. ఊహించిన పరిణామమే ఎదురైంది. కారులోనుంచి కాల్పులు
మొదలయ్యాయి. ఎలాంటి ఎదురుదాడికైనా సిద్ధమైన గ్రేహౌండ్స్, ఎస్‌ఓటీ బలగాలు
ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
ఉదయం 8.40 గంటలు
పదినిమిషాల్లో పూర్తయిన ఆపరేషన్
ఉదయం
ఎనిమిది గంటల 40 నిమిషాలకు తుపాకీ మోతలు ఆగిపోయాయి. ఇరువైపులా నిశ్శబ్దం.
అంటే కమాండోలు కేవలం పదినిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేశారు.
ఉదయం 8.45 నిమిషాలు
కారులో మృతదేహం
మరో
ఐదు నిమిషాలు బయటే అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు.. ఎదుటివైపు నుంచి
ప్రతిఘటన ఉండదని నిర్ధారించుకున్నాక.. నిదానంగా కారును సమీపించాయి. అప్పుడు
సమయం 8గంటల 45 నిమిషాలు. కారులో ఓ మృతదేహం గుర్తించాయి. ఉన్నతాధికారులకు
సమాచారం వెళ్లింది.
ఉదయం 9 గంటలు
మోస్ట్‌వాంటెడ్ అయి ఉంటాడన్న విశ్లేషణలు
మరో
పదిహేను నిమిషాలు. అంటే.. ఉదయం 9గంటల కల్లా మీడియాకు ఈ విషయం
తెలిసిపోయింది. భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించడం.. ఓ బిగ్‌షాట్
వెనుక.. భారీ ప్రణాళికే ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. చనిపోయిన
వ్యక్తి మోస్ట్ వాంటెడ్ అయి ఉంటాడన్న విశ్లేషణలూ వినిపించాయి.
ఉదయం 10 గంటలు
గ్యాంగ్ స్టర్ నయీమొద్దీన్‌గా నిర్ధారణ
మరో
గంట తర్వాత.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఆపరేషన్‌లో నేలకూలింది
గ్యాంగ్‌స్టర్ నయీమొద్దీన్ అని ఉదయం 10 గంటలకు నిర్ధారణకు వచ్చారు.
ఆతర్వాత మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లాఎస్పీ ఇదే విషయాన్ని ప్రకటించారు.
గ్రేహౌండ్స్, ఎస్‌ఓటీ దళాల విజయం
ఆపరేషన్‌లో పాల్గొన్న 30మంది కమాండోలు
మొత్తానికి
అత్యంత పకడ్బందీగా, రహస్యంగా సాగిన ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్, ఎస్‌ఓటీ
దళాలు విజయం సాధించాయి. పోలీసులకు కంట్లో నలుసులా మారిన నయీమ్‌ను
తుదముట్టించాయి. సుమారు 30మంది సుశిక్షిత కమాండోలు ఈ ఆపరేషన్‌లో
పాల్గొన్నారు.

No comments:
Post a Comment