Friday, 5 August 2016

ఎయిర్‌టెల్‌ అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్..


ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. మార్కెట్‌లో పోటీని తట్టుకుంనేందుకు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే ఎయిర్‌టెల్ తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ. 1,199కి ఒక నెలలో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో లోకల్‌ కాల్స్‌తో పాటుగా ఎస్టిడీ, రోమింగ్ కాల్స్, ఎస్సెమ్మెస్, డేటా ప్లాన్‌లు కూడా ఉన్నాయి. త్వరలో రిలయెన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేశం కానుండటంతో ఈ సరికొత్త ఆలోచన చేసింది భారతీ ఎయిర్‌టెల్. రిలయన్స్ జియో ఇప్పటికే 4జి సర్వీసుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది.

No comments:

Post a Comment